అయితే 6-10-22 ఇంటిలో నిద్రపోతున్న వెంకటప్పయ్య కొడుకు జితేంద్ర ప్రసాద్‌కు బాత్రూం నుంచి ఏదో అలికిడి వినిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా… తన తండ్రి వెంకటప్ప ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే జితేంద్ర ప్రసాద్ ఇరుగుపొరుగవారిని పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
అతని పేరు వెంకటప్పయ్య…గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో డెయిలీ లేబర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో పని ముగించుకొని పొన్నూరులోని తన ఇంటికి బయలు దేరాడు. అయితే తమ ఇంటి సమీపంలోని పొలం దాటుతుండగా ఏదో అలికిడైనట్లు అనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తన భార్య శశిరేఖ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంది. వెంటనే వెంకటప్పయ్య కోపం పట్టలేక భార్యతో గొడవ పడ్డాడు. అయితే శశిరేఖ ఆమె ప్రియుడు మంగయ్య కలిసి వెంకటప్పయ్యపై దాడి చేసి అక్కడ నుండి వెళ్లిపోయారు. అవమాన భారంతో ఇంటికి వచ్చిన వెంకటప్పయ్య ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇదేమి పట్టించుకోని శశిరేఖ కూడా ఎప్పటి లాగే ఇంటికి వచ్చింది. వెంకటప్పయ్య, శశిరేఖలకు పద్దెనిమిదేళ్ల కొడుకున్నాడు. ఈ విషయం భార్యభర్తలు ఎవరికీ చెప్పుకోలేదు.
అయితే 6-10-22 ఇంటిలో నిద్రపోతున్న వెంకటప్పయ్య కొడుకు జితేంద్ర ప్రసాద్‌కు బాత్ రూంలో ఏదో శబ్దం అయినట్లు అనిపించి ఉలిక్కిపడి లేచాడు. వెంటనే బాత్ రూంలోకి వెళ్లి చూశాడు. తన తండ్రి వెంకటప్ప ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే జితేంద్ర ప్రసాద్ చుట్టుపక్కల వారిని పిలిచి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే వెంకటప్పయ్య చనిపోయినట్లు గుర్తించారు. తన తండ్రి ఆత్మహత్యకు తల్లి శశిరేఖ, ఆమె ప్రియుడు మంగయ్యే కారణమని జితేంద్ర ప్రసాద్ భావించాడు. తన అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు చుట్టు పక్కల వారితో పాటు బంధువులతోనూ మాట్లాడాడు. శశిరేఖకు గత ఐదేళ్లుగా మంగయ్యతో వివాహేతర సంబంధం ఉన్న విషయం జితేంద్ర ప్రసాద్‌కు తెలిసింది. తల్లి, ఆమె ప్రియుడు కలిసి తన తండ్రి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శశిరేఖ, మంగయ్యలపై కేసు నమోదు చేశారు.
రెండేళ్ల పాటు విచారణ జరిగిన కేసులో మంగయ్య చనిపోవడంతో అతనిపై కేసును తొలగించారు. సాక్ష్యాధారాలతో వెంకటప్ప ఆత్మహత్యకు శశిరేఖే కారణమని పోలీసులు నిరూపించారు. దీంతో ఆమెకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష , ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..