మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో అక్రమ వసూళ్లు, రిపోర్టర్లుగా చెబుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద కారు, రూ.90 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద వివిధ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు.
Fake reporters: ఈ మధ్యకాలంలో డబ్బులు అక్రమంగా సంపాదించాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేసే ప్రయత్నంలో కొందరు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా తెలంగాణలో రిపోర్టర్‌లమని చెప్పుకుంటూ.. ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన తుంగ రమేశ్, జిల్లపల్లి పోశం, చొప్పదండి జనార్దన్, డొబ్బల విష్ణు, తోడేటి సంతోష్, మాసాని, తగడం వెంకటేశ్, రమేశ్ అక్రమ వసూళ్లకు ముఠాగా ఏర్పడ్డారు. రిపోర్టర్లుగా చెప్పుకుంటూ రేషన్ బియ్యం రవాణా, పశువులు, అక్రమంగా ఇసుక, కలప అక్రమంగా తరలించే వ్యాపారులను బెదిరిస్తున్నారు.
రిపోర్టర్లపై నిఘా పెట్టిన..
ఏడాది నుంచి వసూళ్లకు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా గోదావరిఖనికి చెందిన జక్కుల శ్రీధర్, మొగిలి అనిల్ కుమ్రంభీం జిల్లాలోని కౌటాల నుంచి ఎద్దులు కొనుగోలు చేశారు. వాటిని తీసుకెళ్తుండగా కళ్లెంపల్లి వద్ద దొంగ రిపోర్టర్ల ముఠా అడ్డుకుంది. అంతేకాదు పర్మిషన్లు లేకుండా పశువులను తరలిస్తున్నారని, వ్యాన్ సీజ్ చేయిస్తామని వారిని బెదిరించారు. దీంతో భయపడిన వ్యాపారులు ముందుగా రూ.80 వేలు నగదు ఇచ్చారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయట పడింది. దొంగ ముఠా రిపోర్టర్లపై నిఘా పెట్టిన పోలీసులు వారికి ఎట్టకేలకు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
ఈ ఏడుగురు గతంలోనే పలువురి వద్ద సుమారు రూ. 5 లక్షల నగదు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. నిందితుల వద్ద కారు, రూ.90 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిపోర్టర్ల పేరిట ముఠాగా ఏర్పడిన వారిపై పలు సెక్షన్ల కింద వివిధ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దొంగ ముఠా సభ్యులు ఇంకా ఎవరినైనా బెదిరించినట్లు కంప్లయింట్ చేస్తే న్యాయం చేస్తామని ఏసీపీ సూచించారు. పర్మిషన్ లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాపారులపై యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై శ్యాం పటేల్ నీల్వాయి పీఎస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





