పూజగదిలో ఓ ఇల్లాలు వెలిగించిన దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని రాయికోడ్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పూజగదిలో ఓ ఇల్లాలు వెలిగించిన దీపం అంటుకొని రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని రాయికోడ్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రెవెన్యూ, పోలీస్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్కు చెందిన మంగలి విఠల్, అంజయ్య ఇద్దరు అన్నదమ్ములు. పక్కపక్కనే ఇళ్లు ఉంటాయి. ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం విఠల్ భార్య రత్నమ్మ ఇంట్లోని పూజగదిలో దీపం వెలిగించి బయటకు వెళ్లిపోయింది.
ఈ క్రమంలో ఆ దీపం ఇంట్లోని దుస్తులకు అంటుకొని మెల్లిగా ఇంటి దులాలకు మంటలు అంటుకున్నాయి. కొంతసేపటికి పక్కనే ఉన్న అంజయ్య ఇంటికి కూడా ఆ మంటలు వ్యాపించాయి. దీంతో రెండు ఇండ్లు చూస్తుండగానే పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విఠల్ ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులతోపాటు రెండున్నర లక్షల డబ్బుతో పాటుగా, నాలుగన్నర తులాల నగలు, దస్తావేజులు అగ్నికి ఆహుతయ్యాయి.
మంగలి అంజయ్య ఇంట్లో ఉన్న వివిధ వస్తువుల కాలిపోవడంతో రూ.50వేల నష్టం వాటిల్లింది. రెండు ఇండ్లలో కలిపి మొత్తం రూ. 5.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కాలిపోయిన ఇండ్లను పోలీసులు, ఆర్ఎస్ఐ శ్రీకాంత్ సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
గుర్తు తెలియని మహిళ అస్థి పంజరం
గుర్తు తెలియని మహిళ అస్థి పంజరం లభించిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాలకల్ హద్నూర్-ఎల్గోయి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మండలంలోని హద్నూర్-ఎల్గోయి శివారు జాలవాగు సమీపంలో గుర్తు తెలియని మహిళా శవాన్ని చూసిన రైతులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్నారు. గుర్తు తెలియని మహిళ పూర్తిగా కుళ్లి పోయి అస్థిపంజరం మాత్రమే ఉందన్నారు. వయస్సు 50 వరకు ఉంటుందని, శవంపై నల్లని స్వెట్టర్, గులాబీ రంగు అకుల డిజైన్ ఉందన్నారు. పట్టు చీర పసుపు పచ్చరంగు కలిగి ఉందన్నారు. మహిళ చనిపోయి దాదా పు నాలుగు నెలలు అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేసి ఇక్క డికి తీసుకువచ్చి పడివేశారా..?.. లేదా అత్మ హత్యకు పాల్పడిందా.. ఇంకా ఏదైనా కార ణంతో మహిళ మృతి చెందిందా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Garuda Puranam: మరణానంతర జీవితం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!
- AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..
- AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
- Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు!