April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

హనుమాన్ ఆలయంలో అపచారం.. శివలింగం పక్కన మాంసం ముద్దలు.. వీడియోలు వైరల్!


హైదరాబాద్ లోని తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో మాసం ముద్దలు కనిపించడంతో భక్తులు, అర్చకులు షాక్ కు గురయ్యారు. ఆలయంలోని శివలింగం వెనుక కొందరు దుండగులు మాంసం ముద్దలు పడేశారు.


HYD BREAKING: హైదరాబాద్ లోని తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయం(Hanuman Temple)లో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో మాసం(Meat) ముద్దలు కనిపించడంతో భక్తులు, అర్చకులు షాక్ కు గురయ్యారు. ఆలయంలోని శివ లింగం వెనుక కొందరు దుండగులు మాంసం ముద్దలు పడేశారు. ఇది గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు సైతం ఆలయం దగ్గరకు చేరుకుంటున్నాయి. మాసం ముద్దలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులను గుర్తించడం కోసం పలు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇది అల్లరి మూకల పనా? లేక మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు
గతేడాది సికింద్రాబాద్ లో విగ్రహ ధ్వంసం..
గతేడాది అక్టోబర్ లో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వసం చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన హిందూఐ సంఘాలు, బీజేపీ నేతలు భారీ ఆందోళనలు చేశారు. ముంబైకి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్‌ ఈ విగ్రహం ధ్వసం చేసిన కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. విగ్రహారాధనపై వ్యతిరేకతతోనే అతను ఈ చర్యకు పాల్పడినట్లుగా నిర్దారించారు పోలీసులు

Also read

Related posts

Share via