కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ విద్యార్థి రావూరి సాయిరాం ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్‌లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం నరసాపురం దగ్గర బాడిద గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP Crime: మెడికల్ విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చక్కగా చదువుకొని ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది మెడికల్ చదువులు చదువుతున్నారు. కానీ వారు చదువులు పూర్తి కాకముందుకే వారి జీవితం ముగుస్తుంది. తాజాగా ఏపీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేస్తున్నాడు. సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్‌లో ఎవరు లేని గదిలోకి వెళ్లి రావూరి సాయిరాం(22) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమ విఫలమై..
సాయిరాం ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించటంతో.. గమనించిన తోటి విద్యార్థులు తక్షణమే సిబ్బందికి తెలిపారు. వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులు మృతి చెందిన రూమ్‌ను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. అసలు విద్యార్థి ఎందుకు హ్యాంగింగ్ చేసుకున్నాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
సాయిరాం స్వస్థలం నరసాపురం దగ్గర బాడిద గ్రామంగా పోలీసులు గుర్తించారు. సాయిరాం మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. మెడికో సాయిరాం సూసైడ్‌కి లవ్ ఎఫైర్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌తో లవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సాయిరాం ఫస్ట్ ఇయర్‌లో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేశాడు. ఈనెల 21 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో ఇలా చేశాడా..? అనే కోణాలలో విచారిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కాకినాడ జిజిహెచ్‌కి తరలించారు. సాయిరాం మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు
సాయిరాం.. మృతిపై డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సాయిరాం ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని.. స్టూడెంట్స్ చూసి వెంటనే మాకు సమాచారం ఇచ్చారన్నారు. పరీక్షలు తగ్గర పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాడా.. అనేది తెలియదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదన్నారు. ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని సాయిరాం గురించి డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు
Also read
- ఈ రాశుల వారికి జాక్‌పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు