ఎన్టీఆర్ జిల్లాలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కంచికర్లలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఈమెకు పరిటాలకు చెందిన గాలి సైదాతో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బలవంతంగా నగ్న ఫొటోలు కూడా తీశాడు.
ఫొటోలతో ఆ యువతిని బెదిరించి..
ఆ ఫొటోలను యువకుడు స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు కూడా ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




