February 24, 2025
SGSTV NEWS
CrimeNational

దారుణం.. మరదలిని హత్య చేసిన బావ



కొరుక్కుపేట: కుటుంబ కలహాల కారణంగా అక్క భర్త తన మరదలిని గొంతు కోసి హత్య చేసిన ఘటన తిరువొత్తియూర్లో కలకలం రేపింది. వివరాలు.. తిరువొత్తియూర్లోని సెల్వ కుమార్ ఆయపిళ్ గార్డెన్ ఏరియాకు చెందిన ధనలక్ష్మి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసే పనిలో ఉన్నారు. తనతో పాటు సోదరి సెల్వి కూడా ఉంది. అంతలో ధనలక్ష్మి అక్క సెల్వి భర్త కాళీ ముత్తు అక్కడికి వచ్చాడు. అక్కడ కుటుంబ గొడవలు చోటు చేసుకున్నాయి.

దీంతో ధనలక్ష్మి, కాళీ ముత్తు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కాళీముత్తు దాచిన కత్తితో ధనలక్ష్మి మెడపై నరికి పారిపోయాడు. ధనలక్ష్మి రక్తపుమడుగులో కుప్పకూలిపోయింది. ఈ శబ్ధం విని ఇరుగుపొరుగు వారు గుమిగూడి చూడగా ధనలక్ష్మి ప్రాణాలతో పోరాడుతూ పడి ఉండడం చూసి షాక్కు గురయ్యారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలోనే ధనలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై తివొత్తియూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via