తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెట్టడం లేదు ఓ కొడుకు.. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను అవసాన దశలో కనీసం ఆదరించడం లేదు..ఎన్ని సార్లు.. కొడుకును బ్రతిమాలిన పట్టించుకోవడం లేదు. ఇక లాభం లేదని కొడుకు ఇంటి ముందు బైఠాయించిన ఆ వృద్ధ తల్లిదండ్రులు తమ గోడు వినేవారి కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.. పోలీసులు తమకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు. ఈ హృదయవిదారక సంఘటన పూర్తివివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా కోరుట్లలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కోరుట్లలోని ఆనంద్ నగర్ లో తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కొడుకు ఇంటి ఎదుట తల్లిదండ్రులు బైఠాయించారు. ఆనంద్ నగర్ కు చెందిన గంగాధర సుబ్బయ్య, లక్ష్మి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొన్నేళ్లుగా వారి కొడుకు తల్లితండ్రుల పోషణ చూడక పోవడంతో వృద్దదంపతులు వారి కూతురు ఇంట్లో ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం బుచ్చయ్య అనారోగ్యం భారిన పడటంలో లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్నారు.. ఆ డబ్బులు వాటిని చెల్లించాలని కొడుకు దగ్గరికి వెళ్ళితే వెళ్లగొట్టాడు. వారు పెద్ద మనుషులను ఆశ్రయించారు..
కానీ..కొడుకు మాత్రం ఇంటికి రానివ్వడం లేదు. కడుపు కాస్త తిండి కుడా పెట్టడం లేదు. ఇటీవల r.d.o కార్యాలయం లో ఫిర్యాదు చేశారు. r.d.o జివాకర్ రెడ్డి.. కుమారుడు లింగమూర్తి ని పిలిపించి మాట్లాడారు. తల్లితండ్రుల పోషణ చూడాలని వారి ఖర్చులకు నెలకు రూ.3000ల నగదు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికి కుమారుడు పట్టించు కోలేదు.
దీంతో వృద్ధ తల్లితండ్రులు చేసేదేమీ లేక కొడుకు ఇంటి ముందు బైఠాయించారు. చుట్టూ పక్కల వారు వచ్చి వారిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎండను సైతం భరించి అక్కడే కూర్చున్నారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఆందోళన కొనసాగిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు..ఆ.. కొడుకు మనస్సు మాత్రం కరగడం లేదు. లేదంటే ఇతని పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు..
Also read
- ఈ రాశుల వారికి జాక్పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు