తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. చివరకు పోలీసులు అక్కడి చేరుకుని సమస్యను పరిష్కరించారు.
తండ్రి అంత్యక్రియల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం ఎంతగా పెరిగిపోయిందంటే తండ్రి మృతదేహాన్ని ఏకంగా రెండు ముక్కలు చేయాలని అనుకున్నారు. ఒక భాగానికి ఒకరు అంత్యక్రియలు నిర్వహించాలని, మరో భాగానికి మరోకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలోని జాతర పోలీస్ స్టేషన్ పరిధిలోని లిధౌరా తాల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకుని భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే
లిధౌరా తాల్‌కు చెందిన 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ ఫిబ్రవరి 03వ తేదీ సోమవారం రోజు ఉదయం మరణించారు. ఆయన మరణానంతరం చిన్న కుమారుడు దామోదర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, బంధువులు అతని ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు సిద్ధమయ్యారు, ఇంతలో దామోదర్ అన్నయ్య కిషన్ సింగ్ ఘోష్ కూడా అక్కడికి చేరుకుని అతను కూడా తండ్రి అంత్యక్రియలు చేయాలని అనుకున్నాడు. అయితే కిషన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు దామోదర్ నిరాకరించాడు
తండ్రి చివరి వరకు తనతోనే ఉన్నాడని.. అందుకే తానే అంత్యక్రియలు చేస్తానని దామోదర్ భీష్మించి కూర్చున్నాడు. ఈ విషయమై సోదరుల మధ్య వాగ్వాదం జరగింది. గొడవ ముగిసే వరకు తండ్రి మృతదేహాన్ని కూడా ఇంటి బయటే ఉంచారు. అన్నదమ్ములిద్దరినీ కలిసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు, బంధువులు ఎంతగానో ప్రయత్నించినా కిషన్ సింగ్ మాత్రం అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు సోదరులు. దీంతో భయపడిపోయిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని పెద్ద కొడుకు కిషన్ సింగ్ ఘోష్ కే కర్మకాండ బాధ్యతులను అప్పగించారు.
Also read
- మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
- ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది.. మృతదేహంతో స్మశానంలో జాగారం..!
- Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం
- Andhra: చవితి వేళ పాలు పోసేందుకు పుట్ట వద్దకు భక్తులు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?




