కోలకత్తా ఆర్జీకర్ కాలే్ అండ్ హాస్పటల్. దేశంలో దీని పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. జూనియర్ డాక్టర్ రేప్, హత్య తరువాత ఈ ఆసుపత్రి పేరు మారు మోగిపోయింది. ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజ్ కు చెందిన ఓ యువతి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.
కోలకతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అక్కడి కమర్ హతి ఈఎస్ఐ క్వార్టర్స్ లో తన గదిలో ఉరి వేసుకుని చనిపోయింది. విద్యార్థిని తల్లి ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె శవమై కనిపించింది. ఎంత తుపుకొట్టినా తీయకపోయేసరికి అనుమానం వచ్చి బద్దలు కొట్టి చూడగా…విద్యార్థిని ఉరివేసుకుని కనిపించిందని తల్లి చెప్పారు. వెంటనే దగ్గరలో ఉన్న వారి సహాయంతో ఆమె ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమ చనిపోయి చాలా సేపు అయిందని డాక్టర్లు చెప్పారు. తరువాత మృతదేహానని పోస్ట్ మార్టం కు పంపించారు.
డిప్రెషన్ తోనే అని అనుమానం..
ఈ ఘటనపై కమర్ హతి పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని పోలీసులు తెలిపారు. అయితే ఆమె చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని…అది భరించలేకే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డిప్రెషన్‌తో బాధపడి సూసైడ్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.
Also read
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి