శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్-3 వద్ద అర్థరాత్రి కలకలం రేగింది. హాస్టల్ ప్రాంగణంలో 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని స్పృహలేకుండా పడిపోయి ఉంది. ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఎడమ కన్ను, చెంపలపై, చేతులపైన గాయాలు కనిపిస్తున్నాయి. తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్న లక్ష్మిని తోటి విద్యార్థినిలు చూసి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు..
శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్-3 వద్ద అర్థరాత్రి కలకలం రేగింది. హాస్టల్ ప్రాంగణంలో 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని స్పృహలేకుండా పడిపోయి ఉంది. ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఎడమ కన్ను, చెంపలపై, చేతులపైన గాయాలు కనిపిస్తున్నాయి. తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్న లక్ష్మిని తోటి విద్యార్థినిలు చూసి హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. సిబ్బంది వెంటనే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ప్రస్తుతం బాధితురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఇంకా ఆమే స్పృహలోకి రాలేదు. విద్యార్ధిని ఫీట్స్ వచ్చి పడిపోయి ఉండొచ్చనీ హాస్టల్ వార్డెన్ పూర్ణ చెబుతున్నారు. అయితే, తమ కుమార్తెకు ఫిట్స్ లేదని ఏదైనా అఘాయిత్యం జరిగి ఉండవచ్చని బాధితురాలు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఏమి జరిగిందో.. నిగ్గు తేల్చలంటూ పోలీసులను కోరుతున్నారు.
జరిగిన ఘటనపై ఒన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు స్పృహలోకి వస్తే ఏమి జరిగిందో తెలుస్తుందని పోలిసులు పేర్కొంటున్నారు.
బాధితురాలిది.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలోని ఓ కుగ్రామం.. శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



