ఒంగోలు::
మాఘమాసం ఎంతో విశిష్టమైన మాసమని ఈ మాసంలో ప్రత్యేకమైన పండుగ దినాలు వాసవి కన్యకా పరమేశ్వరి నిజరూప దర్శనం, వసంత పంచమి, రథసప్తమి మరియు మహాశివరాత్రి పర్వదినాల తో పాటుగా సంత్ రవిదాస్ జయంతి, చత్రపతి శివాజీ జయంతి, మహర్షి దయానంద జయంతి మరియు మాతృ పితృ పూజన్ దివస్ మొదలగు దివ్యమైన రోజులు ఉన్నాయని శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రామణ గుప్తా అన్నారు. ఏ నదీ స్నానం చేసిన గంగా స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని, ఇంతటి మహిమాన్వితమైన మాఘమాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం రోజున ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని చూసి అలౌకిక ఆనందాన్ని హిందూ బంధువులందరూ పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తిని సుందరంగా అలంకరించిన పల్లకిపై ప్రతిష్టింపజేసి నగర వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగింపుచేశారు. కార్యక్రమంలో భాగంగా సన్నాయి మేళం, గోమాత ముందునడువగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరిప్రదక్షిణలో శ్రీవారికి ఉపయోగా 30 వేల విలువైన ఇత్తడి ఛత్రమును స్వర్గీయ శనగపల్లి శేషారావు గారి జ్ఞా|| భార్యా అనసూర్యమ్మ
కుమారుడు : వెంకట భరత్ కుమార్ కోడలు : అనురాగ మనుమలు : తపస్విని , మోక్షశ్ర షణ్ముఖ శివ కృష్ణ లు శ్రీవారి కార్యక్రమమునకు సమర్పించారు కార్యక్రమంలో సన్నిధి ఈ కార్యక్రమంలో మట్టా రాజేంద్ర, భరత్ కుమార్ అనురాగ శ్రీ గిరి గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు తదితర భక్తులు విచ్చేసి జయప్రదం చేశారు. ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు ఆధ్వర్యంలో ప్రసాద కైంకర్యాన్ని ఫ్యామిలీ క్లబ్ సభ్యులు పొట్టి వీర రాఘవరావు సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025