మీర్‌పేట్‌లో గురుమూర్తి భార్యను అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. అలాంటి కొన్నికేసులు ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ ఆర్టికల్‌లో చదవండి. షీనా బోరా మర్డర్ కేసు 10ఏళ్లు అయినా తేలలేదు. బంగ్లాదేశ్ ఎంపీ, ఢిల్లీలో శ్రద్ధా వాకర్, గ్వాలియర్‌లో మరో కేసు ఇలాంటివే.
పెళ్లాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించా.. తర్వాత దాన్ని చెరువులో కలిపా అని గురుమూర్తి పోలీసుల విచారణలో చెప్పాడు. తిరిగి తానే మళ్లీ పోలీసులను.. హత్య చేసినట్లు సాక్ష్యాలు చూపించాలని ప్రశ్నిస్తున్నాడు. హైదరాబాద్ మీర్‌పైట్‌తో జరిగిన హత్యకు గురించి వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగినట్లు మనం వింటుంటాం. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్స్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి మర్డర్ ప్లాన్ సంచలనం రేపుతుంది. ఇంట్లో రక్తపు మరకలు లేవు, కుక్కర్‌లో డెడ్‌బాడీని ఉడికించినట్లు ఆనవాళ్లు లేవు, అసలు భార్య వెంకట మాధవి డెడ్‌బాడీనే లేదు. నరికిన మొద్దు, కత్తి క్లీన్‌గా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క సాక్ష్యం గురుమూర్తే దోషి అని పోలీసులు చెప్పడానికి లేదు.
100 మంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్థోషికి శిక్ష పడకూడదు
ఎంత పెద్ద తప్పు చేసినా.. ఒక్క తప్పుతో నేరస్తుడు దొరికిపోతాడనేది పోలీసుల లాజిక్. కానీ.. పోలీసుల లాజిక్‌లకే అందని మ్యాజిక్‌లు గురుమూర్తి పాన్నాడు. నేరం రుజువుకానంత వరకూ ఎన్ని హత్యలు చేసినా నిర్ధోషే. భారతీయ శిక్షా చట్టాలు ఇదే చెబుతున్నాయి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ.. ఒక్క నిర్థోషికి కూడా శిక్ష పడకూడదనేది ఇండియన్ క్రిమినల్ లా తీరు. ప్రత్యేక్షంగా తానే నేరం చేశానని ఒప్పకున్నా.. సాక్ష్యాలు లేలిదే కోర్టు శిక్షించలేదు. చాలామంది చట్టాల్లో లొసుగులను వాడి తప్పులు చేసి తప్పించుకుంటారు. మీర్‌పేట్‌లో భర్యను కిరాతంగా చంపిన ఎక్స్ ఆర్మీ మన్ గురుమూర్తి కేసులో కూడా నింధితుడు తప్పించుకోవడానికి చాలా లొసుగులు ఉన్నాయి. డెడ్‌బాడీ లేనంత వరకు.. చంపిన వ్యక్తి తానే మర్డర్ చేశా అని చెప్పినా పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. గురుమూర్తి కేసులో సినిమా స్టోరీని మించి ట్విస్టులు ఉన్నాయి.
10ఏళ్లైనా షీనా బోరా మర్డర్ కేసు తేలలే
సేమ్ ఇలాంటి ఘటనే 2012 ఏప్రిల్ 25 ముంబైలో జరిగింది. హత్య చేసిన మూడేళ్ల దాకా విషయం బయటకు రాలేదు. తర్వాత చంపిందే కన్నతల్లే అని అందరికీ అనుమానం ఉన్నా.. డెడ్‌బాడీ మాత్రం దొరకలేదు. షీనా బోరా మర్డర్ కేసు సీబీఐ పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. షీనా తల్లి ఆరేళ్లు శిక్ష అనుభవించి.. బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని విచారించింది. 10ఏళ్లు అవుతున్నా షీనా బోరా డెడ్‌బాడీ పోలీసులకు దొరకలేదు. ఆ కేసు క్లోస్ కాలేదు. గురుమూర్తి కేసు కూడా ఇలానే మారునుందా? ఈ రెండు కేసులకు ఉన్న దగ్గర సంబంధం ఏంటి? ఎక్స్ ఆర్మీ మెన్ గురుమూర్తికి శిక్ష పడకుండా మర్డర్ ఎలా ప్లాన్ చేశాడు? ఇలాంటి విషయాలన్ని ఇప్పుడు చూద్దాం..
ఇంద్రాణి ముఖర్జీ(50) షీనా బోరా మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు. అంతేకాదు ఆమె బాధితురాలి కన్నతల్లి. డ్రైవర్, రెండో భర్తతో కలిసి మొదటి భర్తతో కన్న కూతుర్ని ఇంద్రాణి ముఖర్జీ హతమార్చి్ంది. 1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. వార్తల్లోకి ఎక్కింది. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసిందని డ్రైవర్ పోలీసులకు చెప్పాడు.
చంపిన మూడేళ్లకు విషయం బయటకు..
ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది.
రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో
ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్‌లో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్నారు.
డెడ్‌బాడీ దొరకకపోవడంతో నిందితురాలికి బెయిల్
సీబీఐ ఈ హత్య కేసులో ఎంత వెతికినా షీనా బోరా డెడ్‌బాడీ కనిపించలేదు. 2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్‌లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఆమెకు సుప్రీం కోర్టు 2022 మేలో బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ కేసు ఇంకా అలాగే ఉంది.
శ్రద్ధా వాకర్ శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో
2022 నవంబర్‌లో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ కేసు కూడా మీర్‌పేట్ హత్య కేసులాంటిదే. ఢిల్లీలో ఓ యువకుడు గర్ల్‌ఫ్రెండ్‌ను తన అపార్ట్‌మెంట్‌లో చంపి 35 ముక్కలు చేశాడు. శ్రద్ధా వాకర్ శరీరాభాగాలను కట్ చేసి కవర్‌లో చుట్టి ఫ్రిజ్డ్‌లో పెట్టాడు. మే 18, 2022న అఫ్తాబ్ అమీన్ పూనావాలా లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న శ్రద్ధా వాకర్‌ను హత్య చేసినట్లు స్వయంగా తానే ఒప్పుకున్నాడు. పోలీసులకు ఈ కేసులో సాక్ష్యాలు లభించాయి. శ్రద్దావాకర్ శరీరభాగాలు ఆమె డిఎన్‌ఏతో మ్యాచ్ అయ్యాయి. దీంతో పోలీసులు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 6వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించి కోర్పు దోషికి శిక్ష విధించింది. తీహార్ జైలులో ప్రస్తుతం ముద్దాయి శిక్ష అనుభవిస్తున్నాడు.
గ్వాలియర్లో 400 ముక్కలుగా చేసి 15 సంచుల్లో
మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని బహదుర్‌పూర్‌కు చెందిన రాజు ఖాన్‌కు అదే ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు కల్లు ఖాన్, నజీమ్లతో ఏదో విషయంలో గొడవ జరిగి కేసు నమోదైంది. కేసు రాజీ చేసుకుందామని తండ్రీకొడుకులైన కల్లు ఖాన్, నజీమ్లు.. రాజుఖాన్ను తమ ఇంటికి పిలిపించారు. అయితే, కేసు వెనక్కి తీసుకునేందుకు రూ. 20 వేల ఇవ్వాలని కోరారు రాజుఖాన్. డబ్బులు ఇస్తానని నమ్మించిన నిందితులు.. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటి వద్దకు రావాలని కోరారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న తర్వాత వారి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడే గదిలో ఉన్న డంబెల్తో రాజుఖాన్ తలపై బలంగా కొట్టి హత్య చేశారు తండ్రీకొడుకులు. తర్వాత మృతిచెందిన రాజ్ఖాన్ శరీర భాగాలను 400 ముక్కలుగా చేసి 15 సంచుల్లో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా వివిధ ప్రాంతాల్లో వేశారు. ఈ హత్య కూడా 2023 అక్డోబర్ టైంలో జరిగింది. సాక్ష్యాలు దొరికాయి కాబట్టి నేరస్తులకు శిక్ష పడింది.
ఆర్మీ మైండ్ గురుమూర్తి ప్లాన్ ఏంటి..?
మరి గురుమూర్తి కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దొరుకుతాయా అంటే.. అది ప్రశ్నార్థకమే. పోలీసులు కూలంకుషంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు నిజంగా గురుమూర్తి మాధవిని నిజంగానే హత్య చేశాడా? చేసి ఉంటే ఆమె డెడ్‌బాడీ ఆనవాళ్లు ఎక్కడ? ఇంట్లో రక్తం మరకలైనా ఉండాలి కదా? మాధవి జనవరి 13నుంచి కనిపించకుండాపోతే.. 18వ తేదీ దాకా ఎవరికీ అనుమానం రాలేదా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలును గుర్తించారు. మాధవి శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. వాటి డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల డీఎన్ఏతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్‌ఫ్రారెడ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
హానీ ట్రాప్ చేసి ఎంపీని ముక్కలుగా నరికి
గురుమూర్తి ఓ సాధారణ వ్యక్తి కాదు.. ఎక్స్ ఆర్మీ మెన్, ఆర్మీలో ట్రైన్ అయిన వ్యక్తి మైండ్ ఎంత షార్ప్‌గా ఆలోచిస్తోందో అందరికీ తెలుసు. అదే తరహాలో గురుమూర్తి భర్తను చంపిన విషయం అందరికీ తెలిసినా.. చట్టం ముందు తాను నిర్థోషిని అని నిరూపించుకోడానికి ఇంకా ఎన్ని ప్లాన్లు వేశాడో పోలీసుల విచారణలో తెలుస్తాయి. గతేడాది బంగ్లాదేశ్‌లో ఓ ఎంపీనే హానీ ట్రాప్ చేసి ఇదే విధంగా హత్య చేశారు. ఎంపి అన్వరుల్ అజీమ్ అనార్ ముక్కు, చెవులు, వేళ్లు కత్తిరించి
అతికిరాతకంగా చంపారు. ఎంపీని ఒక మహిళ ట్రాప్‌లో వేసి తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్స్ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈ కేసులో కూడా బాడీ పార్ట్స్ ముక్కలు ముక్కలు చేసి ఎముకల నుంచి వేరు చేసి అక్కడక్కడా పారవేశారు.
Also read
- ఈ రాశుల వారికి జాక్‌పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు