ఆ ఊర్లో ఆదో పురాతన ఆలయం. గుడి నిర్వహణ బాధ్యతలు చేపట్టే వ్యక్తి.. గుడిలోని సీతారాముడి విగ్రహాలపై కన్నేశాడు. పథకం ప్రకారం గుడిలోని విగ్రహాలను దొంగిలించాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు మరుసటి రోజు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుడిలో విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని దొంగ కన్నీరు కార్చాడు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు సంగతి బయటపడింది..
లక్నో, జనవరి 20: ఆ ఊరి దేవాలయంలో దేవుడి విగ్రహాలు మాయం అయ్యాయి. దీంతో ఆ గుడి బాధ్యతలు చూసే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫిర్యాదు చేసిన వ్యక్తే మరికొందరితో కలిసి దేవుడి విగ్రహాలను దొంగిలించినట్లు తెలుసుకుని పోలీసులు పరేషానయ్యారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో పద్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మీర్జాపూర్‌లో పురాతన రామాలయం ఉంది. అయితే వంశీదాస్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఆ గుడి నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో తాజాగా ఆలయంలోని పురాతన దేవుడి విగ్రహాలు చోరీ అయ్యాయంటూ జనవరి 14న వంశీదాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారంటూ పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మాత్రం ఆలయంలోని దేవుడి విగ్రహాల చోరీ వంశీదాస్ డైరెక్షన్లోనే జరిగిందని తెలుసుకుని షాకయ్యారు. చోరీ చేసిన నలుగురు వ్యక్తులను జనవరి 18న అరెస్ట్ చేశారు. నిందితుల్లో వంశీదాస్‌తోపాటు లవ్‌కుష్ పాల్, కుమార్ సోని, రామ్ బహదూర్ పాల్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. వారు దొంగిలించి దాచిన దేవుడి విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత మూడేళ్లుగా వంశీదాస్ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు ఆలయ యాజమన్యం విషయంలో వంశీదాపః గురువు మహారాజ్ జైరామ్ దాస్, సతువా బాబాతో చాలా కాలంగా వివాదం నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆలయ ఆస్తులను తన మేనల్లుడికి బదిలీ చేయాలని జైరామ్ దాస్ భావిస్తున్నట్లు తెలుసుకున్న వంశీదాస్, విగ్రహాలను దొంగిలించి విక్రయించేందుకు పథకం రచించాడని పోలీసులు తెలిపారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు