February 3, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

Sexual harassment: ఎంత పని చేశార్రా.. మైనర్ బాలుడిపై స్నేహితులు లైంగిక దాడి!


యూపీ రుద్రాపూర్‌లో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలుడిపై తన ముగ్గురు స్నేహితులు లైంగిక దాడి చేశారు. పనిపేరుతో ముంబై తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అసహజ సంభోగానికి పాల్పడ్డారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. పరారీలో ఉన్న నిందుతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు

Sexual harassment: ఉత్తరప్రదేశ్ డియోరియాలో దారుణం జరిగింది. రుద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలుడిపై తన స్నేహితులే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉద్యోగం పేరిట ముంబై తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉండటం విశేషం.

లైంగిక దాడిలో ఒక మైనర్ బాలుడు..
ఈ మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ వీర్ వివరాల ప్రకారం.. బాధిత బాలుడి వయస్సు 15 ఏళ్లు. అతనిపై అత్యాచారం చేసిన నిందితుల వయసు 15, 18 ఏళ్లు ఉంటుందన్నారు. ఈ సంఘటన జనవరి 3న రుద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జరిగింది. బాధితుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది, కానీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తాము ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయగా.. బాధితుడు మాత్రం ముగ్గురు దారుణానికి పాల్పడ్డారని చెబుతున్నాడని విక్రాంత్ వీర్ చెప్పారు.

ఉద్యోగం సాకుతో ముంబై తీసుకెళ్లి..
బాధిత బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ నిందితుడు తన బిడ్డను ఉద్యోగం సాకుతో ముంబై తీసుకెళ్లాడు. అక్కడ మా కొడుకుకు మత్తు మందు ఇచ్చారు. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత అసహజ సంభోగానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన తర్వాత వారు ఏం చేసారో గ్రహించాడు. దీంతో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిందుతుల్లో ఒకడు ఇక్కడికి వచ్చి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏడాది బాలికపై అత్యాచారం..
ఇదిలా ఉంటే.. గత ఏడాది ఆగస్టులో డియోరియాలోనే  ఓ బాలికపై అత్యాచారం జరిగింది. సదర్ కొత్వాలి ప్రాంతంలోని ఓ కాలనీలో పాలు కొనుగోలు చేసేందుకు బాలిక దుకాణానికి వెళ్లింది. అయితే దుకాణదారు ఆమెపై దారుణంగా దాడి చేసి లైంగిక కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. బాలిక ఏడుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడిని చితక బాదారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే శలభమణి త్రిపాఠి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక కుటుంబాన్ని పరామర్శించారు.

Also read

Related posts

Share via