హైదరాబాద్ : సినీ అవకాశాల పేరుతో నమ్మించి మహిళపై లైంగికదాడికి పాల్పడిన దుండగుడిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం మేరకు … ఏపీకి చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి మణికొండలో హౌస్ కీపింగ్ పని కోసం వచ్చింది. 15 రోజుల క్రితం అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో చేరింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నించడానికి కృష్ణానగర్ ప్రాంతంలో తెలిసినవారిని వాకబు చేస్తున్న క్రమంలో … డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్న కాటేకొండ రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఆడిషన్స్ ఉన్నాయంటూ … కృష్ణానగర్‌లోని ఓ హౌటల్‌కు ఆమెను పిలిపించాడు. మొదటి రోజు ఫొటోషూట్ చేసి మరుసటి రోజు రావాలని చెప్పాడు. రెండో రోజు వెళ్లగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!