February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

TG Crime: ప్రాణం తీసిన పతంగులు.. నలుగురు మృతి


పండగ పూట ఎగురవేసిన గాలిపటాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. భవనాలపై పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు నిర్మల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.

TG Crime:  సరదా సంబురాలు చేసుకునే సంక్రాంతి పండగ పూట కొందరి ఇంట్లో విషాదాన్ని నిప్పుతోంది.  ఎగురవేసిన గాలిపటాలే ఆ కుటుంబాల్లో మరణ గోశ వినిపిస్తోంది. భవనాలపై పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో నలుగురు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. నిర్మల్, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. నిర్మల్‌లోని గుల్జార్‌ మార్కెట్‌ ప్రాంతంలో ఉంటున్న ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ షఫి కుమారుడు హుఫేజ్‌(11) మాంజా తగిలి  మృతి చెందాడు. హుఫేజ్‌ మైనార్టీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వచ్చారు. పండగ సందర్భంగా మిత్రులతో కలిసి గాలిపటం ఎగురవేసేందుకు ఓ భవనంపైకి వెళ్లాడు. పతంగిని ఎగురవేస్తుండగా అదుపుతప్పి భవనంపై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరో ఘటన యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలులో  చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జూపల్లి నరేందర్‌(48)  డాబాపైకి ఎక్కి పతంగి ఎగురవేశారు. డాబాపైన రక్షణగోడ లేకపోవటంతో కిందపడ్డాడు. తీవ్రగాయాలైన నరేందర్‌ను కుటుంబసభ్యులు ఆలేరు ఆస్నత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ల తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని జిల్లెలగూడలో చోటుచేసుకుంది. మహేశ్‌యాదవ్‌(39) పతంగి ఎగురవేయడానికి ఓ భవనం ఎక్కారు. దాన్ని ఎగురవేస్తూ అదుపుతప్పి భవనంపై నుంచి కిందపడ్డాడు. అతను అక్కడికక్కడే మరణించారు.

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం మార్కండేయనగర్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా.. అద్దెకుంటున్న కొందరు యువకులు గాలిపటాలను ఎగురవేస్తుండగా.. చూడడానికి వెళ్లారు. గాలిపటాలను చూస్తూ మాధవరావు కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడిది కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన చింతల్‌వార్‌ మాధవరావు(60)గా గుర్తించారు.

Also read






Related posts

Share via