చీరాల (బాపట్ల) : ఆ అన్నయ్య అన్నదమ్ముల బంధం ఎంతో వీడనిది. కష్టంలోనూ, సంతోషంలోనూ ఒకరికి ఒకరు ఉన్నామని ధైర్యం చెబుతూ ఎంతో ఐక్యంగా ఉండేవారు. వీరి బంధం గురించి వారి బంధువులలో అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి బంధంను ఆ అన్నదమ్ములు మృత్యువులోను వీడలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న అన్నను తమ్ముడు ఆసుపత్రిలో చేర్చాడు. అయితే అన్న మృతి చెందాడని తమ్ముడికి వైద్యులు చెప్పటంతో తనకు చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అన్న ఇక లేడన్న మరణ వార్త జీర్ణించుకోలేక తమ్ముడు ఉన్నపాటునే కుప్పకూలి హఠాన్మరణం చెందాడు. ఈ హఅదయ విదారక ఘటన చీరాల మండలం గొల్లపాలెం లో బుధవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం … పట్టణంలోని 14 వ వార్డు గొల్లపాలెంలో నివాసం ఉంటున్న బాలాజీ, పద్మ దంపతుల కుమారులు గొల్లప్రోలు గంగాధర్ (40), గొల్లప్రోలు గోపి (34) ఇద్దరు సొంత అన్నదమ్ములు. అయితే అన్నయ్య గంగాధర్ మూడు రోడ్ల సెంటర్లో వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ తమ్ముడు గోపిని బి టెక్ చదివించాడు. ప్రస్తుతం తమ్ముడు గోపి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ పలు ప్రాంతాలలో శిక్షణ తీసుకుంటు అన్నయ్య వడ్రంగి పనిలో సాయం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని … కుటుంబ సభ్యులతో అప్పటివరకు సరదాగా గడిపిన ఆ అన్నదమ్ములో అన్నయ్య గంగాధర్ కు గుండెనొప్పి రావడంతో వెంటనే బంధువుల సాయంతో తమ్ముడు గోపి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి అనంతరం చీరాల ఏరియా వైద్యశాలకు హుటాహుటిగా తీసుకువచ్చారు. వైద్యశాలలో వైద్య పరీక్షలు అందించిన వైద్యులు గంగాధర్ రావు మఅతి చెందినట్లు నిర్ధారించి వెంటపెట్టుకొని వచ్చిన తమ్ముడు గోపికి విషయం తెలియజేశారు. అయితే అన్నను ఎలాగైనా బతికించుకోవాలని చూసినప్పటికీ మఅత్యువు వెంటాడడంతో వైద్యులు చెప్పిన నిజాన్ని జీర్ణించుకోలేక తమ్ముడు అక్కడే అన్న మృతదేహం వద్ద సొమ్మసిల్లిపడిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో వైద్యులు అతడిని బతికించేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ గోపి శరీరం సహకరించలేదు. దీంతో అన్న మఅతదేహం వద్దే తమ్ముడు కూడా మృతి చెంది విగత జీవుడై మృత్యుఒడికి చేరుకున్నాడు. అక్కడున్న చూపరులు, వైద్యులు కంటతడిపెట్టారు. ఇది ఇలా ఉంటే తండ్రి బాలాజీ కూడా గుండెపోటుతో గత నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెండో పట్టణ సీఐ నాగభూషణం ఏరా వైద్యశాలకు చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు గంగాధర్ రావుకు భార్య, పాప సంతానం ఉండగా, తమ్ముడు గోపికి ఇంకా వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబానికి జీవన ఆధారంగా ఉన్న ఇద్దరు బిడ్డలను కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. దీంతో పండగ పూట అన్నదమ్ముల మఅతితో గొల్లపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..