సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అతని ఇద్దరు భార్యలు రోకలి బండతో కొట్టి కిరాతకంగా హతమార్చారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG Crime: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఘోరంగా కొట్టారు. భర్తపై కక్ష పెంచుకున్న ఇద్దరు భార్యలు.. అతన్ని ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆదివారం అర్ధారత్రి గుట్టు చప్పుడు కాకుండా భర్తను రోకలి బండతో కొట్టి చంపారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఈ దారుణంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు.
రోకలి బండతో కొట్టి..
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. చుట్టు పక్కల వారిని ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమర్టం నిమిత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తను చంపిన ఇద్దరు భార్యలపై కేసు నమోదు చేశారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పండగ వేళ భర్తను రోకలి బండతో ఇద్దరు భార్యలు ఘటనతో తెలంగాణాలో హాట్ టాపిక్గా మారింది. భర్తను రోకలి బండతో కొట్టి చంపిన కేసుపై ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read
- ఈ రాశుల వారికి జాక్పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు