February 4, 2025
SGSTV NEWS
CrimeNational

Mumbai: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే?


ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలని ఓ యువకుడు డిజిటల్ చీటింగ్‌కి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్ష జరుగుతుండగా మైక్రో ఇయర్ పీస్ పెట్టుకుని రాశాడు. పరీక్ష సమయంలో యువకుడిని గుర్తించి చీటింగ్ చేసు నమోదు చేశారు.

Mumbai: పరీక్షల్లో పాస్ కావాలని చాలా మంది కాపీ కొడుతుంటారు. ఎందుకంటే ఫెయిల్ అయితే మళ్లీ ఇంకో ఏడాది పడుతుందనే ఉద్దేశంతో చీటింగ్‌కి పాల్పడతారు. అధికారులకు దొరకకపోతే పర్లేదు.. ఒకవేళ దొరికిపోతే మాత్రం డిబార్ చేసేస్తారు. కొన్నేళ్ల పాటు పరీక్షలు రాయడానికి కూడా వీలు కుదరదు. అయితే తాజాగా ఓ యువకుడు ఉద్యోగ పరీక్షల్లో డిజిటల్ చీటింగ్ చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

ఉద్యోగం సంపాదించాలనే కసితో..
ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో చీటింగ్ చేసి చివరకు దొరికిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లా భోకర్డాన్‌కు చెందిన 22 ఏళ్ల కుష్నా దల్వి ఎన్నో రోజుల నుంచి పోలీస్ ఉద్యోగం కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉద్యోగం సంపాదించాలనే కసి ఉన్నా కూడా చదువు మాత్రం ఇంట్రెస్ట్ పెట్టి చేయలేదు. దీంతో చీటింగ్‌కి పాల్పడ్డాడు

ముంబైలో ఓషివారాలోని రాయ్‌గఢ్ మిలిటరీలో డ్రైవర్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. దీనిలో ఉత్తీర్ణత సాధించాలని చీటింగ్ చేశాడు. ఒక మైక్రో ఇయర్ పీస్ పెట్టుకున్నాడు. దీన్ని ఫోన్‌కి కనెక్ట్ చేసి.. స్నేహితుల ద్వారా సమాధానాలు రాశాడు. అయతే చెవి లోపల అతను మైక్రో ఇయర్ పెట్టడంతో అధికారులు గుర్తించలేకపోయారు. ఆ యువకుడు పరీక్ష రాస్తుండగా గుర్తించారు. వెంటనే ఆ యువకుడితో పాటు స్నేహితులపై కేసు నమోదు చేశారు. కుష్నా దగ్గర నుంచి మైక్రో ఇయర్ పీస్, సిమ్‌కార్డ్, మొబైల్ ఫోన్‌ తీసుకుని వారిని పోలీసులు అరెస్టు చేశారు

Also read

Related posts

Share via