తెలంగాణలో కామాంధుల చేతిలో మరో మహిళ బలైంది. మెదక్ జిల్లా రామంతాపూర్లో అంబేద్కర్ విగ్రహం అరుగుపై మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను భరోసా సెంటర్కు తరలించారు.
Medak: తెలంగాణలో కామాంధుల చేతిలో మరో మహిళా బలైంది. నడి బజారులో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. అర్ధరాత్రి మద్యం మత్తులో విచక్షణ మరిచిని దుర్మార్గులు.. ఆమె వద్దని వేడుకుంటున్న కనికరించకుండా కాటేశారు. ఒకరి తర్వాత ఒకరు మృగాళ్ల బలవంతంగా శృంగార కోరిక తీర్చుకునేందుకు దారుణానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో చోటుచేసుకోగా స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
విగ్రహం వెనుక గద్దెపైనే దారుణం..
ఈ మేరకు మతిస్థిమితం లేని మహిళ రామంతాపూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒంటరిగా ఉంది. అయితే అటువైపుగా వెళ్తున్న ముగ్గురు పురుషులు మద్యం మత్తులో ఆమెపై లైంగిక దాడి చేశారు. విగ్రహం వెనుక గద్దెపై సాముహిత అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం అనుకోకుండా బయటపడింది.
వేరే మహిళ కేసులో నిందితుల కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తుండగా ఇది బయటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మతి స్థిమితం లేని మహిళ తన వివరాలు చెప్పలేకపోవడంతో భరోసా సెంటర్కు తరలించారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





