February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Grandson Suicide Note: తాత లేని జీవితం నాకొద్దు.. కంటతడి పెట్టిస్తున్న మనవడి సూసైడ్ నోట్!


తాత మరణం తట్టుకోలేక మనువడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మనోజ్(27) ఫ్యామిలీ పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంటుంది. 3నెలల క్రితం అతడి తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మనస్థాపానికి గురై మనోజ్ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు.

తాత, మనవళ్ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి మధ్య బాండింగ్‌కు ఏ బంధం సరిపోదు. ఎప్పుడూ తాత తాత అంటూ వెంట తిరుగుతూనే ఉంటాడు మనవడు. ఇక తాత కూడా మనవడ్ని ఒక్క నిమిషం విడచిపెట్టకుండా ఉండలేడు. వీరి అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. చిన్న తనంలో తల్లిదండ్రుల ప్రేమ ఒకెత్తయితే.. వారికన్నా తాత ప్రేమ మరో అద్భుతమైన ప్రపంచం.

ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటాడు తాత. తల్లి దండ్రులు తన బిడ్డను కొట్టినా.. మందలించినా ఊరుకోడు. తనతో పాటే బయటకు తీసుకుపోతాడు. కావాల్సింది కొనిస్తాడు. మనవడి ఆనందం కోసం ఏదైనా చేస్తాడు. మరి అలాంటి తాత మరణిస్తే.. దాన్ని తట్టుకోవడం మనవడికి చాలా కష్టం. గుండెలు పగిలేంతలా ఏడుస్తాడు. తాత ఇక లేడని తెలిసి తనలో తానే కుమిలిపోతాడు. తాజాగా అలాంటిదే జరిగింది. 

తన తాత హఠాన్మరణాన్ని ఓ మనవడు తట్టుకోలేకపోయాడు. ఎంతో మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం తన తాత దగ్గరకు వెళ్లిపోతానని ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సూసైడ్ నోట్ తన తాతతో మనవడికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాత అంటే చాలా ఇష్టం
మనోజ్(27) అనే యువకుడు తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొంపల్లి శివాలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఇక మనోజ్‌కు తన తాతయ్య అంటే చాలా ఇష్టం. అయితే మూడు నెలల క్రితం అతడి తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మనోజ్ ఎంతో మనోవేదనకు గురయ్యాడు

మనస్థాపంలో మృతి
తాత మరణించినప్పటి నుంచి మనోజ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తరచూ తన ఇంట్లో వాళ్లతో.. తాత పిలుస్తున్నాడు.. తాతయ్య దగ్గరకు వెళ్లిపోతానంటూ చెప్పేవాడు. ఈ తరుణంలోనే ఒకరోజు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక దీనికి ముందు ఒక సూసైడ్ నోట్ రాసి పక్కన పెట్టాడు

అందులో తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరించాడు. ‘‘ అమ్మ నాన్న నన్ను క్షమించండి. నాకు తాత గుర్తొస్తున్నాడు. అందుకే వెళ్లిపోతున్నాను’’ అంటూ అందులో రాసి ఉంది. ప్రస్తుతం ఆ నోట్ వైరల్ కావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read

Related posts

Share via