జనావాసాల్లో వన్యప్రాణులు కలకలం రేపుతున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రజలు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూ పార్క్ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ పై వెళుతుండగా సైన్స్ సెంటర్ వద్ద చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ మునికుమార్‌ను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శేషాచలం కొండల నుంచి చిరుతలు బయటకు వస్తున్నాయి. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జూ పార్క్ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. శనివారం(జనవరి11) మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జూ పార్క్ రోడ్డు క్రాస్ చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిపై చిరుత దాడి చేసింది.
టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ పై వెళుతుండగా సైన్స్ సెంటర్ వద్ద చిరుత దాడి చేసింది. సైన్స్ సెంటర్ వైపు నుంచి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతూ చిరుత దాడి చేసింది. చిరుత దాడితో గాయపడిన మునికుమార్‌ను స్థానికులు పక్కనే ఉన్న రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని టీటీడీ అటివీశాఖ అధికారులు పరిశీలించారు.
గత కొద్ది రోజులుగా అలిపిరి, సైన్స్ సెంటర్ తోపాటు పక్కనే ఉన్న స్విమ్స్, రుయా ఆసుపత్రి ప్రాంతాల్లో చిరుతల సంచారం జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంతాల్లో, ప్రత్యేకించి హాస్టల్స్ వద్దకు చిరుతలు వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఈ మధ్యనే ఎస్‌వి యూనివర్సిటీ లోని శ్రీనివాస ఆడిటోరియం, బొటనికల్ గార్డెన్ ప్రాంతాల్లో చిత్త సంచారాన్ని నిర్ధారించిన అటవీశాఖ అధికారులు పాదముద్రలు కూడా సేకరించారు. ఇప్పుడు ఏకంగా జూ పార్క్ రోడ్డుపైకి రావడం ముని కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అటు వైపు ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..