ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంక్వైరీ టాప్ గేర్‌లో నడుస్తోంది. ఓ వైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ వేగం పెంచాయి. కేసులో నిందుతులుగా ఉన్న అధికారులను వరుసగా విచారిస్తోంది. బీఎల్‌ఎన్ రెడ్డిపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. మొన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది.
మొన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, నిన్న కేటీఆర్.. ఇవాళ బీఎల్‌ఎన్ రెడ్డి. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్పీడందుకుంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఇంటరాగేషన్.. ఇంటర్ లింక్స్‌తో సాగుతోంది. A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ని మొన్న విచారించిన ఏసీబీ… ఆయన స్టేట్‌మెంట్ ఆధారంగా A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిన్న ప్రశ్నించింది ఏసీబీ. రెండు సెషన్లు… సుమారు 7 గంటలపాటు కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు..? ఎంత మొత్తంలో నిధులను ట్రాన్సఫర్ చేశారు..? లిఖితపూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా..? అంటూ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేశారు.
ఇక ఇప్పుడు A1, A2 స్టేట్‌మెంట్ ఆధారంగా.. A3 బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు. నిధులు చెల్లింపు కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదు..? విదేశాలకు నిధులు చెల్లించాలంటే RBI అనుమతి తీసుకోవాలన్న కనీస విషయం తెలియదా…? ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు…? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా ఈ ఇంటర్ లింక్ ఎంక్వైరీతో అధికారులు ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





