తిరుపతి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పాలకమండలి, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్నవారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. కుట్రకోణాన్ని కూడా పరిశీలిస్తున్నామన్న పవన్.. పోలీసుల ఉదాసీనతపై సీఎంతో పాటు డీజీపీ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “తప్పు జరిగింది.. క్షమించండి.. ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి మధ్య గొడవలున్నాయి” అని అన్నారు. మనుషులు చనిపోయారని, ఇది ఆరచే సమయమా అంటూ తన అభిమానులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల తప్పు ఉందన్నారు. దీనికి బాధ్యత తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ అన్నారు. జరిగిన దానికి చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానన్నారు. క్షతగాత్రుల కుటుంబాలకు టీటీడీ బోర్డ్ మెంబర్లు స్వయంగా వెళ్లి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కొంత మంది పోలీసులు కావాలని చేసినట్టుగా క్షతగాత్రులు చెప్తున్నారు. పోలీసులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నా దృష్టికి వస్తోంది. మరోవైపు కుట్రకోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. పోలీసుల ఉదాసీనతపై సీఎంతో పాటు డీజీపీ దృష్టికి తీసుకెళ్తానన్న పవన్ కల్యాణ్, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, పాలకమండలికి మధ్య సమన్వయం లేదని తెలుస్తోందన్నారు. దేవాలయాల్లో ప్రక్షాళన అవసరమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!