తన చేతుల్లో పెరిగిన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు.
కొల్హాపుర్ (మహారాష్ట్ర): తన చేతుల్లో పెరిగిన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లా పన్హాలా పోలీస్ స్టేషను పరిధిలో జరిగిన వివాహ రిసెప్షనులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉట్రే గ్రామంలోని మేనమామ మహేశ్ పాటిల్ ఇంట్లో పెరిగిన ఆ యువతి తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకోవడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. అయిష్టంగానే ఆ జంటను ఆశీర్వదించి రిసెప్షను ఏర్పాటు చేశారు. ఆందోళనతో రగిలిపోతున్న మేనమామ మహేశ్ అతిథుల కోసం సిద్ధం చేస్తున్న భోజనాల్లో విషం కలిపాడు. దూరం నుంచి దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు మహేశ్‌ను నిలదీయడంతో అతడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అతిథులు ఆ భోజనం ఆరగిస్తే పెద్ద అనర్థమే జరిగేది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025