February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Varra Ravinder Reddy: అన్నీ తెలుసు.. కానీ, చెప్పలేను!

అధికార పార్టీ నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్రెడ్డికి మొదటి రోజు పోలీసు కస్టడీ ముగిసింది. వర్రా పెట్టిన ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా ఆయన్ను వైఎస్సార్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ మంగళవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు.

పొడిపొడిగా సమాధానాలిచ్చిన వర్రా రవీందర్రెడ్డి

కడప : అధికార పార్టీ నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్రెడ్డికి మొదటి రోజు పోలీసు కస్టడీ ముగిసింది. వర్రా పెట్టిన ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా ఆయన్ను వైఎస్సార్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ మంగళవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. సుమారు 30 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. కొన్ని ఫేస్ బుక్ ఖాతాలు తనకు తెలియకుండానే సృష్టించి, తప్పుడు పోస్టులు పెట్టారని వర్రా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఎవరి ప్రోద్బలంతో పోస్టులు పెట్టారనే దానిపై సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. చాలా ప్రశ్నలకు ‘అన్నీ తెలుసు… సమాధానాలు ఇవ్వలేను’ అంటూ దాటవేసినట్లు సమాచారం. కడప నాలుగో అదనపు జిల్లా కోర్టు అనుమతితో పులివెందులకు చెందిన వర్రా రవీందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కడప సైబర్ క్రైం పోలీస్ స్టేషన్, ఎస్పీ కార్యాలయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎస్పీ బృందం ప్రశ్నించింది.

ఆయన తరఫున న్యాయవాది ఓబుల్రెడ్డి సమక్షంలో ఆడియో, వీడియో రికార్డు చేస్తూ విచారణ సాగింది. వర్రా నుంచి 43 పేజీల ఫేస్బుక్ ఖాతాలను సీజ్ చేశారు. వాటిలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితతో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులతో పాటు మార్ఫింగ్ ఫొటోలు ఉన్నాయి. షర్మిల, విజయమ్మ, సునీతకు సంబంధించిన అసభ్యకర పోస్టులున్నాయి. వాటిని వర్రా ముందు ఉంచి ప్రశ్నించగా.. కొన్నింటికి అవుననే సమాధానం చెప్పినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి తన పేరుతో 18 నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారని వర్రా చెప్పినట్లు సమాచారం. తొలిరోజు కస్టడీ పూర్తి కాగానే రిమ్స్ వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించారు. గురువారం కూడా విచారణ చేపట్టనున్నారని, 10వ తేదీన విచారణ నివేదికను కడప కోర్టు ఎదుట ఉంచనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది ఓబుల్రెడ్డి తెలిపారు.

Also read

Related posts

Share via