శని ప్రదోష ఉపవాసం హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివుని పూజించి ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంది. అంతేకాదు ఈ రోజున శనీశ్వరుడిని కూడా పూజిస్తారు. ఎవరైతే ఈ రోజున పూజ చేసి ఉపవాసం ఉంటారో వారి జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజున శనీశ్వరుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు కూడా ప్రస్తావించారు. వీటిని చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం.
హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రత మహిమ శివపురాణంలో పేర్కొనబడింది. ఈ వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి తిధి రోజున ఆచరిస్తారు. ఈ ఉపవాసం నెలకు రెండుసార్లు వస్తుంది. ఈ రోజున శివుని పూజించి ఉపవాసం ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉంటే పరమశివుని విశేష ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈ రోజున ఉపవాసం చేసి శివుడిని,శనిశ్వరుడిని పూజిస్తే ఆ ఇళ్లలో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. అదే సమయంలో బాధలన్నీ తొలగిపోతాయని విశ్వాసం.
ఈ సంవత్సరం మొదటి శని ప్రదోష వ్రతం ఎప్పుడంటే
ఈ ఏడాది తొలి ప్రదోష వ్రతం శనివారం వచ్చింది. అందుకే దీనిని శని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శని ప్రదోష వ్రతం జనవరి 11 ఉదయం 8.21 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జనవరి 12 ఉదయం 6:33 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం శని ప్రదోష వ్రతం జనవరి 11 న ఆచరించనున్నారు.
శని ప్రదోష వ్రతం రోజున శివలింగానికి గంగాజలం, పాలు, తేనెతో అభిషేకం చేయాలి. శివునికి బిల్వ పత్రం, ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం. కనుక ఈ రోజున శివునికి బిల్వ పత్రం, ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ శివలింగానికి చదనం సమర్పించడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుందని నమ్మకం
ఈ రోజున శివునికి గంగాజలం, అన్నం నైవేద్యంగా సమర్పించడం ద్వారా.. వ్యక్తి రుణ విముక్తుడవుతాడు. అంతేకాదు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతాడు.
శని ప్రదోష ఉపవాసం రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.
ఈ రోజు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు, నూనెను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదృష్టం అదృష్టంగా మారుతుంది.
ఈ రోజు పేదలకు.. ఆకలి అన్నవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి కలుగుతాయి.
శనీశ్వరుడి నీలం రంగు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ రోజున నీలం రంగు దుస్తులు ధరించాలి. అంతేకాకుండా శనీశ్వరుడికి నీలిరంగు పూలను కూడా సమర్పించాలి
Also Read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!