February 4, 2025
SGSTV NEWS
CrimeNational

క్లాస్మేట్ పై జూనియర్ డాక్టర్ అత్యాచారం



గ్వాలియర్: ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలోని  ఉపయోగంలో లేని హాస్టల్లో ఓ జూనియర్ డాక్టర్(25) తోటి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలోని గజరాజా మెడికల్ కాలేజీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు, బాధితురాలు వేర్వేరు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.

ఆదివారం నిందితుడు కాలేజీ ఆవరణలోనే ఉన్న ఉపయోగంలో లేని బాయ్స్ హాస్టల్లోకి రావాలని బాధితురాల్ని కోరాడు. అంగీకరించి అక్కడికి వెళ్లిన ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలు కాంపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు నగర ఎస్పీ అశోక్ జడొన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Also read

Related posts

Share via