February 4, 2025
SGSTV NEWS
CrimeNational

బాలికను వీడియో తీసి.. జైలుకు

యశవంతపుర: బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసిన కామాంధునికి మంగళూరు అడిషనల్ జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధించింది. గతేడాది మార్చి 10న రాత్రి బాలిక ఇంటిలో స్నానం చేస్తుండగా గగన్ అనే యువకుడు ఫోన్తో వీడియో తీశాడు.

బాలిక తల్లిదండ్రులు అతనిపై మంగళూరు జజ్పె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి వినయ్ దేవరాజ్ ఈ మేరకు తీర్పునిచ్చారు. జరిమానా కట్టలేని స్థితి ఉంటే మరో మూడు నెలలపాటు శిక్షను అనుభవించాలని ఆదేశించారు. బాధిత బాలికకు ప్రభుత్వం నుంచి రూ. లక్ష పరిహారంగా అందించాలని అధికారులకు సూచించారు.

Also read





Related posts

Share via