కలపను కాపాడుకునేందుకు రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో అటవీశాఖ సిబ్బందిపై విరుచుకు పడ్డారు. దాడుల్లో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్‌కు గాయాలయ్యాయి. రెండు ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ కలప నిల్వ చేశారన్న ముందస్తు సమాచారంతో అటవీశాఖ దాడులకు దిగింది. లక్షల రూపాయల విలువైన కలపను స్వాధీనం చేసుకుంది. కలపను కాపాడుకునేందుకు రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో అటవీశాఖ సిబ్బందిపై విరుచుకు పడ్డారు. దాడుల్లో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్‌కు గాయాలయ్యాయి. రెండు ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ ఎస్పీ ఆదేశాలతో అటవీశాఖ సిబ్బందికి భద్రత కల్పించిన ఇచ్చొడ పోలీసులు గ్రామంలో కార్డన్ సర్చ్ చేపట్టారు. పది లక్షల రూపాయల విలువైన అక్రమ కలప గుర్తించారు. అటవీ శాఖ సిబ్బందిపై దాడికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలప స్మగ్లర్లకు సహకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అటవీ సిబ్బందిపై దాడికి దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అటవీ శాఖ వర్సెస్ కలప స్మగర్లుగా మారిన కేశవ పట్నం ఘటనలో గాయాలైన బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలప స్మగ్లర్లకు మద్దతుగా నిలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే