February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

నడి రోడ్డుపై భర్త హత్య.. మర్డర్ వెనుక సంచలన నిజాలు


బాపట్లలో భర్తను భార్య చంపిన ఘటనలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. తన టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయిన భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త అమరేంద్ర వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య ఘర్షణ జరిగి చివరకు హత్యకు దారి తీసింది.


Guntur Murder: బాపట్ల జిల్లాలో నడిరోడ్డుపై భార్య తన  భర్తను తాడుతో ఉరేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అమరేంద్ర పదేళ్లుగా రోజు తాగొచ్చి భార్యకు నరకం చూపించేవాడట. మధ్య మత్తులో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడట. దీంతో అతడి టార్చర్ తట్టుకోలేకపోయిన భార్య అరుణ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటుంది. కాగా, ఇటీవలే అమరేంద్ర భార్యను తిరిగి కాపురానికి తీసుకొచ్చేందుకు ఆమె పుట్టింటికి వెళ్ళాడు. భార్య రాకపోతే ఆమెను పొడవాలని నిర్ణయించుకున్నాడు. మద్యం మత్తులో కత్తిని  జేబులో పెట్టుకొని వచ్చాడు. అదే సమయంలో అమరేంద్ర, అరుణ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భార్య అరుణ నడిరోడ్డుపై భర్త మెడకు తాడు కట్టి ప్రాణాలు తీసింది.


ఢిల్లీలో మరో దారుణం
ఇది ఇలా ఉంటే ఢిల్లీలో భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు భర్త.  ఢిల్లీలోని ఉడ్‌బాక్స్ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానాకు మాణిక జగదీశ్ పహ్వాతో అనే అమ్మాయితో పెళ్లయింది. అయితే కొన్ని మనస్పర్థలతో వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే వీరి విడాకుల కేసు విచారణ జరుగుతుండగానే పునీత్ సూసైడ్ చేసుకొని చనిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం భార్య మాణిక..  విడాకుల తీసుకున్న తర్వాత కూడా తనకు వ్యాపారంలో భాగం ఇవ్వాలని,  తనకు రావాల్సిన మొత్తం చెల్లించాలని పునీత్ ని వేధింపులకు గురి చేసిందట. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన పునీత్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పునీత్ చివరిగా తన భార్యతో మాట్లాడిన 6 నిమిషాల కాల్ రికార్డ్‌ను గుర్తించారు. మరి వైపు కుటుంబ సభ్యులు పునీత్ చనిపోయే ముందు వీడియో రికార్డింగ్ చేశాడని.. అది తమ వద్దే ఉందని చెబుతున్నారు.

Also Read

Related posts

Share via