March 13, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు!



ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ సూసైడ్ కి సంబంధించి పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నీటిలో మునగడంతోనే ముగ్గురు చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే ముగ్గురి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో తేలింది.

Kamareddy Incident:  కామారెడ్డిలో  ఎస్సై, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ డెత్ మిస్టరీ కి సంబంధించి పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నీటిలో మునగడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్దారించారు. అలాగే ముగ్గురి ఒంటి పై ఎలాంటి గాయాల్లేవని నివేదికలో తేలింది. ప్రస్తుతం ముగ్గురు ఒకేసారి చనిపోయారా? లేదా ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్లి మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.

ఇద్దరం కలిసే చనిపోదాం..!
విచారణ నేపథ్యంలో  పోలీసులు భిక్కనూర్ పీఎస్‌ నుంచి అడ్లూర్‌ ఎల్లారెడ్డి వరకు దారి పోడవునా సీసీ ఫుటేజీ సేకరిస్తున్నారు. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను పరిశీలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1:26 నిమిషాలకు ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లుగా తెలిపారు. చాటింగ్ లో నిఖిల్, శృతి మధ్య ఆత్మహత్య గురించి చర్చ  జరిగినట్లు బయటపడింది. నేను ఆత్మహత్య చేసుకుంటానంటే..నేనూ చేసుకుంటానని… లేదా ఇద్దరం కలిసే చేసుకుందాం అంటూ చాటింగ్ చాటింగ్ చేసుకున్నారు. ఎస్సై కి సంబంధించిన మూడు సెల్ ఫోన్లలో ఒకటి మాత్రమే అన్ లాక్ అయ్యింది. మరోవైపు ఆర్థికపరమైన అంశాల కోణంలోనూ విచారణ చేస్తున్నారు.  ముగ్గురి బ్యాంక్ ఖాతాల వివరాలను  సేకరిస్తున్నారు.

Also Read



Related posts

Share via