February 4, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఎస్సై సూసైడ్ వెనుక కారణాలివే? .. సంచలన విషయాలు వెలుగులోకి



కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఒకేసారి మృతి చెందడం సంచలంగా మారింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అని పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ మరణాల వెనుక కారణాలేమై ఉండవచ్చు? అనే సంచలన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..





Kamareddy: కామారెడ్డిలో ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి  కలకలం రేపుతోంది.  సదాశివనగర్‌ మండలం ఎల్లారెడ్డి చెరువులో నిన్న అర్థరాత్రి సమయానికి లేడీ కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలో లభ్యమయ్యాయి. ఈరోజు ఎస్సై శవం దొరికింది. ఒకేచోట పనిచేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ శృతి కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్నారు. శృతికి ఇప్పటికే పెళ్ళై విడాకులు అయ్యాయి. ఆపరేటర్ నిఖిల్ వీరికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. అయితే ఈ ముగ్గురు ఒకేసారి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలంగా మారింది. ఇది హత్యా లేదా ఆత్మహత్యా అని పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఈ మరణాల వెనుక కారణాలు ఏమై ఉండవచ్చు..? అనే సంచలన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు మిస్టరీ ఏంటీ?

👉       అసలు ఈ ముగ్గురిని ఎవరైనా చంపి చెరులో పడేసారా?
👉    లేదా  మాట్లాడడానికి వెళ్లి  మాటామాటా పెరగడంతో ఎస్సై కోపంతో  శృతిని చంపేసి.. ఆ తర్వాత భయంతో ఆపరేటర్ ని కూడా చంపి తాను కూడా చనిపోయాడా..? 

👉    లేదా ఎస్సై తనను అంగీకరించడంలేదని శృతి ఆవేదనతో  చెరువులో దూకేయడంతో ఆమెను కాపాడడానికి ఎస్సై, ఆపరేటర్ చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయారా..?

👉    ఎస్సై, శృతి వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులెవరైనా ప్లాన్ ప్రకారం ముగ్గురిని చంపేసారా..?

👉    శృతి, ఆపరేటర్ తో కలిసి తనతో సంబంధం గురించి బయట పెడతానని బెడిటించడంతో ఎస్సై వీరిద్దరి చంపేసి.. తాను చనిపోయాడా..?

ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముగ్గురు ఒకేసారి.. ఒకే విధంగా చనిపోవడం అంతు చిక్కని మిస్టరీగా మారింది.

Also read

Related posts

Share via