👉 బడాబాబులే టార్గెట్గా వలపు వల విసిరిన జాయ్ జమీమా
👉 ఇప్పటికే ఆమెతో పాటు మరో ముగ్గురి అరెస్ట్
👉 తాజాగా కీలక ముఠా సభ్యులు రిమాండ్కు తరలింపు👉 ఇందులో బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజమిన్ కూడా..
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసులో పోలీసులు వేగం పెంచారు.ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురు కీలక ముఠా సభ్యులను కటకటాల్లోకి పంపించారు. ఇందులో బీజేపీకి చెందిన యువ నాయకుడు కూడా ఉన్నాడు. బడాబాబులే టార్గెట్గా చేసుకుని వలపు వల విసిరి.. అనేక మంది నుంచి రూ.లక్షల్లో డబ్బు దోచుకున్న జాయ్మీమాతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఐదేళ్ల నుంచి సమాజంలో ఉన్నతమైన కుటుంబాలను టార్గెట్ చేసిన ఈ ముఠాలో అటవీశాఖ అధికారి బుచ్చ వేణుభాస్కరరావు, కిశోర్ వేముల ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాలో మరో ముగ్గురు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో హైదరాబాద్లో ఉన్న కీలక సూత్రధారులు ఫాతిమా ఉస్మాన్ చౌదరి@జోయా, ఆమె భర్త తన్వీర్తో పాటు బీజేపీ నాయకుడు అవినాష్ బెంజమిన్ను అరెస్ట్ చేశారు.
చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
జాయ్ జమీమాను విచారించిన సమయంలో తనను ఏమీ చేయలేరని, రాజకీయ నాయకుల అండ ఉందని పోలీసులను హెచ్చరించింది. విచారణకు సహకరించలేదు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో బీజేపీకి చెందిన యువ నాయకుడు అవినాష్ బెంజమిన్తో పాటు దంపతులు ఫాతిమా ఉస్మాన్ చౌదరి@జోయా, తన్వీర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. బాధితుల మీద ఉపయోగించిన మత్తు పదార్థాలు, స్ప్రేల సరఫరాలో వీరు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఆ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కంచరపాలెం, ఎయిర్పోర్ట్ పోలీస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ కేసులో జాయ్ జమీమా వెనుక ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో లభించిన సమాచారంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అటవీ శాఖ అధికారి వేణుభాస్కర్రెడ్డిని, మరో సభ్యుడు కిశోర్ వేములను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. భీమిలి కేసుకు సంబంధించి ఆమెకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. మిగిలిన స్టేషన్లలో నమోదైన కేసులపై కూడా ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!