తిరుపతి రాయలచెరువు రోడ్డు కూడలిలోని అన్నమయ్య విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ తొడగడంపై వివాదం
తిరుపతి (తితిదే): తిరుపతి రాయలచెరువు రోడ్డు కూడలిలోని అన్నమయ్య విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ తొడగడంపై వివాదం నెలకొంది. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనపై హిందూ సంఘాలు, స్వామీజీలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్య విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి ఆ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులను అరెస్టు చేసేవరకు ఉపవాస దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. తిరుపతి తూర్పు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా బిచ్చగాడిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. కూడళ్లలో పెన్నులు విక్రయిస్తూ ఉంటాడని, అతడిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సంయమనం పాటించాలని కోరారు. ఇలా చేయడానికి అతడిని ఎవరైనా ప్రోత్సహించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Also Rea’s
- భీష్మాష్టమి రోజున తర్పణాలు సహా- ఈ దానాలు చేస్తే సంతాన ప్రాప్తి తథ్యం!
- నాగ సాధువులకు ఆ శక్తి ఎలా వస్తుంది? – గడ్డకట్టే చలిలోనూ ఎలా ఉండగలుగుతున్నారో తెలుసా? -మీకోసం
- ఈ రెండు గ్రహాలతో అరుదైన యోగం.. వీరికి ఆర్థిక లాభాలు, ఊహించని ప్రయోజనాలు
- శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన ఇసుక శివలింగం.. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎక్కడో కాదు హైదరాబాద్కు దగ్గర్లోనే
- శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ల కూడదా? ఎందుకో తెలుసా?