February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad:గత నెలలో ఎంగేజ్మెంట్.. హాస్టల్లో యువతి ఆత్మహత్య.. కారణమిదే..?

👉అశోక్ నగర్లో రేణుకనాయక్ అనే యువతి ఆత్మహత్య

👉సాయిప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్లో ఉరివేసుకున్న రేణుక నాయక్

👉వెంటనే ఆస్పత్రికి తరలించిన పక్క రూంలోని స్నేహితులు

👉గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేణుకనాయక్ (24) మృతి

👉 రేణుక నాయక్ కు ఫిబ్రవరి 7న పెళ్లి నిశ్చయం.



పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్  చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లొ ఈ ఘటన జరిగింది. సాయి ప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని రేణుక నాయక్ (24) ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. అయితే.. తాను సూసైడ్ చేసుకున్నట్లు పక్క రూములో ఉంటున్న స్నేహితులు గమనించారు. దీంతో.. వెంటనే హాస్టల్ సిబ్బందికి విషయాన్ని చెప్పారు. వెంటనే వారు వచ్చి ఫ్యాన్ కు ఉరి వేసుకున్న అమ్మాయిని విడిపించారు.

కొన ఊపిరితో ఉన్న ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. విద్యార్థిని రేణుక నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని స్వగ్రామం కామారెడ్డి జిల్లా సోమారం గ్రామం. అయితే.. రేణుకకు గత నెలలో ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఆమె పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సూసైడ్ చేసుకుందా.. లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. కాగా.. యువతి ఆత్మహత్యతో కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.

Also read

Related posts

Share via