జగిత్యాల జిల్లా మెట్‌పల్లి (మం) పెద్దాపూర్‌లో గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులను పాము కరించింది. ఓంకార్, యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతంలో పాము కాటుతో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు.
TG Crime: గురుకులాలలో రోజుకు ఒక ఘటనతో అందరినీ కలవర పెడుతోంది. ఒక ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో పాముకాటు ఘటన కలకలం రేపుతుంది. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో ఉన్న గురుకుల పాఠశాల వరుస పాముకాట్లు కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్ధులను పాము కరించింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధి ఓంకార్‌ను నిన్న పాము కరిచింది. ఓంకార్ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన మరవక ముందే.. మరో విద్యార్ధి యశ్వంత్‌ని పాము కరిచింది. యశ్వంత్‌ను కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. గతంలో ఇదే గురుకులంలో పాము కాటుతో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. ఈ గురుకుల పాఠశాలలో వరుస పాముకాటు ఘటనలతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యం:
గురుకులంలో రోజుకు ఒక ఘటన కలకలం రేపుతోంది. ఓ వైపు పాఠశాలలపై ప్రభుత్వం అధికారులపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నా.. జరిగే అనర్థం జరుగుతూనే ఉన్నాయి. అయితే జగిత్యాల ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం చేశారని తెలుస్తోంది. పాముకాటుకు గురైనా విద్యార్థి టీచర్‌కు నొప్పిగా ఉందని చెపితే ఆర్ఎంపీ డాక్టర్‌తో వైద్యం ఇప్పించి లైట్‌గా తీసుకున్నారు. విద్యార్థికి నొప్పి ఎక్కువగా కావటంతో కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు పాము కాటుకు గురైన లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతానికి విద్యార్థులు కోలుకుంటున్నారు. మరో 24 నుంచి 36 గంటలు వరకు ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు.
పాము కాటుకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రి దగ్గరికి చేరుకొని విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్, పాఠశాల గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వహించడం తగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్కూల్‌లో ఇలాంటి ఘటన జరిగినా.. సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. ఇంకా పిల్లలు నొప్పిగా ఉందంటే కూడా టీచర్లు స్పందించక.. ఆర్ఎంపీ డాక్టర్‌ని తీసుకొచ్చి వైద్యం చేయించడం ఏమిటి అని నిలదీస్తున్నారు. పాము కరిచిందని టీచర్‌కి విద్యార్థి చెప్పితే.. జ్వరం ట్యాబ్లెట్స్ వేసుకోమని సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో విద్యార్థులను ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని.. అధికారులు స్పందించి ప్రిన్సిపల్, టీచర్లపై తగు చర్యలు తీసుకోవాలిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..