హైదరాబాద్ యూట్యూబర్ నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని హైవేపై అడ్రస్ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేశాడు. చేతిలో నోట్ల కట్టలు పట్టుకుని రూ.20వేలు రోడ్డు పక్కన విసిరేశాడు. ఇదంతా వీడియో రికార్డ్ చేసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. వీడియో చూసినవారు ఎవరైనా సరే.. వచ్చి తీసుకోవచ్చని ప్రకటించాడు.
రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పోయింది. కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే, మరికొందరు ఎదుటి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తు్నారు. ఇక కొందరు అవతలి వ్యక్తుల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. అలాంటి పని చేసిన ఓ వ్యక్తికి హైదరాబాద్ పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం బాలానగర్ కు చెందిన యూట్యూబర్ భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేశాడు. ఇందులో భాగంగా అతడు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని హైవేపై అడ్రస్ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేశాడు. చేతిలో నోట్ల కట్టలు పట్టుకుని రూ.20వేలు రోడ్డు పక్కన విసిరేశాడు. ఇదంతా వీడియో రికార్డ్ చేసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. వీడియో చూసినవారు ఎవరైనా సరే.. వచ్చి తీసుకోవచ్చని ప్రకటించాడు. అది కాస్త వైరల్‌గా మారడంతో వీడియో పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు భానుచందర్‌ను అరెస్టు చేశారు.
ఇలా ఔటర్ రోడ్డుపై ఇలా డబ్బుల కట్టలు విసిరేయటం చూసిన జనాలు.. ఆ డబ్బుల కోసం ఓఆర్‌ఆర్ పైకి భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ విషయంలో సీరియస్ యాక్షన్‌కు రంగం సిద్ధం చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్‌ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





