ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఖానాపురం గ్రామానికి చెందిన త్రినాథ్ అనే యువకుడు కన్నతల్లినే గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు అతడిపై అనుమానంతో విచారించగా తల్లిని చంపానని త్రినాథ్ అంగీకరించినట్లు సమాచారం.
Khammam District: డబ్బుల కోసం నీచానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. కన్న తల్లినే గొంతునులిమి చంపాడు.. ఒంటిపై పుస్తెలతాడు కోసం కన్నపేగును కడతెర్చాడు. జల్సాలు తప్ప ఏం చేతకాని అతను 9 నెలల పాటు మోసిన కన్నతల్లి పైనే దాడి చేసి క్రూరంగా హత్య చేశాడు..! ఈ దారుణమైన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
తల్లిని చంపిన కొడుకు..
ఖమ్మం నగరం ఖానాపురం గ్రామంలో కొప్పెర వాణి (40) అనే మహిళ తన కుటుంబంతో నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. అయితే ఒకరోజు కొప్పెర వాణి ఇంట్లో చనిపోయి పడింది. దీంతో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరీశీలించగా.. ఆమె ఒంటిపై పుస్తెలతాడు, మ్యాటీలు, దిద్దులు లేకపోవడం గుర్తించారు. దీంతో ఇంట్లోని ఆమె చిన్నకుమారుడు త్రినాథ్ పై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో త్రినాథ్ తానే తల్లిని హత్య చేశానని అంగీకరించినట్లు సమాచారం. అయితే త్రినాథ్ ఏ పని చేయకుండా ఖాళీగా ఊళ్ళో జల్సాలు చేస్తూ ఉంటాడని ఆ గ్రామా వాసులు తెలిపారు. దీంతో డబ్బు అవసరమైన త్రినాథ్ తల్లి ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయి ఆమెను గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
- Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
- Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
- Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
- Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..





