December 17, 2024
SGSTV NEWS
Andhra Pradesh

AP News: నవంబర్ నెల బిల్లు చూసి.. అతనికి కరెంట్ షాక్ కొట్టింది

 

సాధారణంగా వెయ్యి రూపాయలు ఎప్పుడు వచ్చే కరెంట్ బిల్లు.. ఎంత చార్జీలు పెరిగినా మరో 500 వరకు యాడ్ అవుతుంది.. ఇక 500 కరెంట్ బిల్లు వచ్చే వారికి మహా అయితే వెయ్యిలోపు.. అంతే కదా..? కానీ అనకాపల్లి జిల్లాలో.. ఆ బిల్లు చూస్తే షాక్ కొట్టినట్లు అనిపించింది.


అనకాపల్లి జిల్లా వడ్డాదిలో.. ఈ ఘటన జరిగింది. మంచాల గోవిందా అనే ఓ పైపుల వ్యాపారి షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ప్రతినెల 1000 నుంచి 2000 లోపే కరెంట్ బిల్లు వచ్చేది. కానీ డిసెంబర్ నెలలో… నవంబరు నెలకు సంబంధించిన బిల్లు వచ్చింది. దాన్ని చూసి… హార్ట్ ఎటాక్ తెచ్చేంత పని అయింది. ఏకంగా 52వేల 50 రూపాయల బిల్లు చేతికి వచ్చింది. నారాయణమ్మ పేరు మీద ఉన్న మీటర్.. గిరగిరా తిరిగిపోయింది. దీంతో అవాక్కైనా గోవిందా.. ఏం చేయాలో తెలీక తన పొరుగున ఉన్న మరో వ్యాపారితో మాట్లాడాడు. అతను ఆన్లైన్‌లో చెక్ చేసుకునే సరికి సేమ్ సీన్. మల్లెపువ్వు అనే మరో వ్యాపారి తనకు ప్రతినెల 500 లోపే కరెంట్ బిల్లు వచ్చేది. కానీ ఈసారి నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్‌లో ఓ బిల్లు వచ్చింది. అదెంతో తెలుసా..? అక్షరాల..19 వేల 611 రూపాయలు. దీంతో ఆ ఇద్దరు తలలు పట్టుకున్నారు. ఏం చేయాలో వాళ్లకు పాలుపోలేదు.

ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట పాకడం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యుత్ అధికారులు రంగంలోకి దిగారు. ఏం వర్రీ కావొద్దు సొల్యూషన్ మేము వెతుకుతామని భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఇది వారి సైడ్ నుంచి జరిగిన మిస్టేక్ అని అవగతమైంది.  ఇటీవల ఆ ప్రాంతంలో స్మార్ట్ మీటర్లను బిగించారు విద్యుత్ సిబ్బంది. ఆ మీటర్లే ఇప్పుడు ఇంతటి భారీ బిల్లును తెచ్చిపెట్టాయి. అయితే కేవలం ఇద్దరికీ మాత్రమే ఇంతలా బిల్లు వచ్చిందా..? ఇంకా ఈ స్మార్ట్ బిటార్ల బాధితులు ఎవరైనా ఉన్నారా అనే ఆరా తీసే పనిలో పడ్డారు ఈపీడీసీఎల్ సిబ్బంది

Also Read

Related posts

Share via