December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Nandyal: నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది!

 

Nandyal: నందికొట్కూరు బైరెడ్డి నగర్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. లహరి బంధువులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల ఎస్పీ మాట్లాడుతూ.. లహరి నందికొట్కూరులో


నంద్యాల జిల్లా నందికొట్కూరు లోని బైరెడ్డి నగర్ లో ఉంటున్న లహరి.. స్థానిక నంది కాలేజీలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతోంది. స్వగ్రామం వెల్దుర్తి మండలం రామళ్లకోట. అయితే తండ్రి మృతి చెందడంతో నందికొట్కూరులో అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుతోంది. అదే మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు కేవలం పరిచయస్తుడు మాత్రమే. ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఎగ్జామ్స్ దగ్గరగా ఉండటంతో లహరి చదువు మీద శ్రద్ద పెట్టింది. ఆవేశం కసి పెంచుకున్న రాఘవేంద్ర.. ఈ తెల్లవారుజామున అమ్మమ్మ ఇంటిలో ఉండగా ఇంటిలోకి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తను నిప్పు పెట్టుకున్నాడు. ఒళ్లంతా కాలిపోయింది. లహరి అక్కడే మృతి చెందింది. రాఘవేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. రాఘవేంద్రకు ఏదైనా ప్రాణాపాయం ఉండొచ్చని అనుమానంతో రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన ఇంటిని నంద్యాల ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా పరిశీలించి బాధితులను పరామర్శించారు. స్థానికంగా విషాదం నెలకొంది.

నందికొట్కూరు బైరెడ్డి నగర్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. లహరి బంధువులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల ఎస్పీ మాట్లాడుతూ.. లహరి నందికొట్కూరులో ఇంటర్మీడియట్ చదువుతుందని, గతంలో అమ్మాయి, అబ్బాయికి పరిచయం ఉందని, ఇద్దరు వెల్దుర్తి మండలంలో చదువుకున్నారని అన్నారు. అమ్మాయి వాళ్ళ తాత ఇంట్లో ఉంటూ చదువుకోవడానికి వచ్చిందని, ఉదయం 3 గంటలకు సమయంలో ఇద్దరు సూసైడ్ కు ప్రయత్నం చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాఘవేంద్ర అమ్మాయి లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని ఎస్పీ తెలిపారు. సంఘటన స్థలంలో అన్ని క్లూస్ సేకరిస్తున్నామని, లహరి పోస్ట్ మార్టంకు తరలించినట్లు చెప్పారు

Also Read

Related posts

Share via