యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, పొగ మంచు ఐదుగురు నవ యువకుల ప్రాణాలను మింగేసింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు చెరువులో మునిగిపోవడంతో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈత రాకపోవడంతో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఉదయం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మణికంఠ లు హైదరాబాదు నుండి వలిగొండలో పార్టీ చేసుకునేందుకు తెల్లవారుజామున హైదరాబాదు నుండి బయలుదేరారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున ఫాగ్ ఉండడంతో పాటు చెరువు వద్ద మూల మలుపు కూడా ఉండడంతో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. యువకులు బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈత రాకపోవడంతో జల సమాధి అయ్యారు.
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. అందులో ఈత వచ్చిన మణికంఠ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడ్డుకు చేరుకున్న మణికంఠ 100 కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు జలాల్ పూర్ గ్రామస్తులు చెరువు నుండి కారుతోపాటు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. అయితే మణికంఠను చికిత్స కోసం హైదరాబాద్ కు పోలీసులు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఓవైపు పొగమంచు, మరోవైపు మలుపు. రెండు కలిసి ఐదుగురి ప్రాణం తీశాయి. రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. . ఐదుగురు యువకులు మృతి చెందడంతో ఐదు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
హైదరాబాద్ నుంచి పోచంపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అసలు అక్కడ ప్రమాదం ఎలా జరిగిందో ఈ స్ట్రీట్ వ్యూ చూస్తే మనకు అర్ధం అవుతుంది. గూగుల్‌లో ఎవరైనా ఈ స్ట్రీట్ వ్యూ చూడొచ్చు. జలాల్‌పూర్ దగ్గర్లో ఈ మలుపు ఉంది. పక్కనే ఉన్న చెరువుని చూడొచ్చు. అక్కడ చెరువు వల్ల రోడ్డు మలుపు ఉండడం.. రోడ్డుకు చెరువుకు మధ్యలో కంచె కూడా సరిగా లేదు. హై స్పీడ్‌లో వస్తే కచ్చితంగా ఈ చెరువులోకి దూసుకుపోవడం ఖాయం.
ఈరోజు ఉదయం పొగమంచు, హైస్పీడ్‌తోపాటు.. ఇలాంటి మలుపు ఉండడం వల్ల.. యువకులు ఈ చెరువులోకి దూసుకెళ్లిపోయారు. ఈత రాక.. నీటిలో మునిగి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.
Also Read
- Annamayya District : అన్నమయ్య జిల్లాలో దారుణం.. వైసీపీ జడ్పీటీసీ రమాదేవి ఇంటిపై కత్తులు తో దాడి.
- Rape case: ఛీ ఛీ వీడేం వార్డెన్‌రా బాబూ.. అబ్బాయిలను రూమ్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి!
- Mastan Sai Arrest: సెలబ్రిటీల బాత్రూమ్, బెడ్రూముల్లో స్పై కెమెరాలు.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ!
- ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025