ఆనంద్ మీనాల మధ్య ఉన్న ప్రేమ వ్యవహరం గోవింద్‌కు తెలిసిపోతుందని భావించిన ఇద్దరు పక్కా ప్లాన్ వేశారు. ఆనంద్ సహాయంతో భర్త గోవిందును కడతేర్చాలని పథకం చేసిన మీనా పక్కాగా స్కెచ్ వేసింది. గొర్రెలను తీసుకొని అటవీ ప్రాంతంలో మేపుతుండగా
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసింది ఒక ఇల్లాలు. భర్తను అంతమొందించి అదృశ్యమయ్యాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ప్రియుడిపై ఉన్న మోజుతో భర్తను కనిపించిన ఇల్లాలి బాగోతం బయటపడింది. శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లి లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే..
సోలిశెట్టిపల్లికి చెందిన గోవిందు, మీనా లకు 10 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొర్రెల కాపర్లు గా జీవనం సాగిస్తున్న గోవిందు, మీనా దంపతుల మధ్య రాళ్లబూదుగురు కు చెందిన ఆనంద్ ఎంట్రీ ఇచ్చాడు. గొర్రెల పెంపకంతో జీవనం సాగించే ఆనంద్ కు మీనాకు మధ్య పరిచయం ఏర్పడింది. గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఆనంద్ మీనాల మధ్య ఉన్న లవ్ మేటర్ గోవిందు కు తెలిసిపోతుందని భావించిన ఇద్దరు పక్కా ప్లాన్ వేశారు. ఆనంద్ సహాయంతో భర్త గోవిందును కడతేర్చాలని ప్లాన్ చేసిన మీనా పక్కాగా స్కెచ్ వేసింది.
గొర్రెలను తీసుకొని అటవీ ప్రాంతంలో మేపుతుండగా భర్త కళ్ళల్లో కారం కొట్టిన మీనా ప్రియుడి సహకారంతో అంతమోందించింది. బండరాయితో కొట్టి చంపిన ఆనంద్ మీనా లు గోవింద్ డెడ్ బాడీని కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి పక్కనే ఉన్న కర్ణాటక బార్డర్ లో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్త గోవిందును చంపిన భార్య మీనా ఏమీ తెలియనట్టు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కనిపించడం లేదంటూ ఈ నెల 4న ఫిర్యాదు చేసింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు మీనా వాలకంపై అనుమానం వచ్చింది. మర్డర్ చేసి మిస్సింగ్ కేసు ఇచ్చిన మీనా నే అసలు సూత్రధారిగా అనుమానించిన పోలీసులు ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హతమార్చినట్లు గుర్తించారు.
భర్త గోవింద్ కళ్ళల్లోకి కారం కొట్టి బండరాయి తో కొట్టి హతమార్చినట్లు తేల్చారు. గోవింద్ భార్య మీనా, ఆమె ప్రియుడు ఆనంద్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెబుతున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనున్నారు
Also read
- ఈ కోనలో వెలసిన నృసింహస్వామికి నారద, తుంబురుడు రోజూ పూజలు.. సాక్ష్యంగా తులసీదళాలు.. ఆలయం ఎక్కడంటే..
- Vaikunta Ekadasi 2025: 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి..
- Malavya Rajyog in 2025: కొత్త ఏడాదిలో మీన రాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..
- Shabarimala: శబరిమల ఆలయంలో మండల పూజ ఎప్పుడు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
- నేటి జాతకములు 19 డిసెంబర్, 2024