December 4, 2024
SGSTV NEWS
Andhra Pradesh

డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..

విశాఖ : స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రపంచం ఆధునిక పోకడలకు అనుసరిస్తున్నా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికి కూడా వారికి సరైన వైద్యం అందుబాటులో ఉండడం లేదు. ఇక గర్భిణీల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుంది. నొప్పులు ప్రారంభించిన వెంటనే కొన్ని గంటల పాటు గర్భిణీ మహిళను డోలిలో కట్టుకొని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రసవమైన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డ కూడా మృతి చెందడం జరిగింది. తాజాగా మంగళవారం నాడు దేవరపల్లి మండలం బోడిగరువు గ్రామంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న సాహూ శ్రావణి అనే గర్భిణీ ని డోలి కట్టి చిత్తడి కాలిబాటను, పొంగిపొర్లుతున్న వాగును దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లిన గిరిజనులు. ఈ డోలి కష్టాలు తొలగించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Also read

Related posts

Share via