SGSTV NEWS
Andhra Pradesh

4న హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.


– పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలో పాల్గొనాలని పిలుపు.

ఒంగోలు::

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ… హిందువులను రక్షించడానికి తక్షణమే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ఐక్య వేదిక ద్వారా డిసెంబర్ 4వ తేదీ, బుధవారం, ఉదయం 10 గంటలకు ఒంగోలు ప్రధాన వీధుల గుండా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హిందూ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనం లో విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఐక్య వేదిక సమావేశంలో సోమ సుబ్బారావు, తడికమళ్ళ హరిప్రసాద్, త్రిపుర భైరవేశ్వరానంద స్వామీ, రావినూతల రామ్ ప్రసాద్, మక్కపాటి వెంకటేశ్వర్లు, ఈమని బలరామ్, దగ్గుమాటి వెంకారెడ్డి పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహణపై చర్చించారు. బుధవారం, ఉదయం 10 గంటలకు స్థానిక కేశవ స్వామి పేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా ఏనుగు చెట్టు వీధి, ట్రంకు రోడ్డు మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం బంగ్లాదేశ్ లోని హిందువుల పై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని వారు తెలిపారు. నిరసన ర్యాలీలో హిందూ బంధువులందరూ వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also read

Related posts

Share this