December 18, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

వ్యక్తి ప్రాణం తీసిన పాన్‌ అలవాటు.. కదులుతున్న బస్సు నుంచి కింద పడి మృతి

బస్సులో ప్రయణిస్తున్న ఓ వ్యక్తి పాన్‌ ఉమ్మేందుకు డోర్‌ తెరిచాడు. అదుపుతప్పిన అతడు కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు లక్నోలోని చిన్‌హట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రామ్ జివాన్‌గా గుర్తించారు.


పాన్‌ అలవాటు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి పాన్‌ ఉమ్మేందుకు డోర్‌ తెరిచాడు. అదుపుతప్పిన అతడు కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌ ఆర్టీసీకి చెందిన ఏసీ బస్సు అజంగఢ్ నుంచి లక్నో వెళ్తుండగా, ఆ బస్సులో ప్రయాణిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి, పాన్ ఉమ్మేందుకు బస్సు డోర్‌ తెరిచాడు. బస్సు స్పీడ్‌గా ఉండటంతో అతడు బ్యాలెన్స్‌ ఔట్‌ అయ్యాడు. దాంతో అతడు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వేలో వేగంగా వెళ్తున్న ఆ బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

కాగా, లక్నోలోని చిన్‌హట్ ప్రాంతానికి చెందిన రామ్ జివాన్‌గా మృతుడ్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Also read

Related posts

Share via