February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshViral

AP News: ఆ బావి నుంచి వేగంగా చప్పుళ్లు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా..

 

రోజూ ఉదయాన్నే ఆ బావికి సమీపంలోని తమ పొలాల వద్దకు వెళ్లి వారు కూరగాయలు సేకరిస్తారు. అదే మాదిరిగా మంగళవారం కూడా వెళ్లారు. కానీ ఎప్పుడూ లేనిది.. ఆ బావి నుంచి చప్పుళ్లు వినిపించాయి.. ఏంటా వెళ్లి చూడగా….

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు సమీపంలోని ఉన్న బావి అది. రోజూ ఉదయాన్నే ఆ బావి పక్కన పొలాలు ఉన్న రైతులు కూరగాయల సేకరణకు వెళ్తారు. మంగళవారం కూడా ఉదయం అదే పనిపై అక్కడికి వెళ్లారు. అయితే బావి నుంచి చప్పుళ్లు వినిపించాయి. దీంతో కంగారుగా వెళ్లి చూడగా ఓ పాము తెగ తచ్చాడుతూ కనిపించింది. దీంతో అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు స్థానిక స్నేక్ క్యాచర్..  ఓంకార్‌ త్యాడిని తీసుకుని స్పాట్‌కు వెళ్లారు. బావి లోపల చీకటిగా ఉండటంతో అది తొలుత నాగుపాము అని భావించారు. లైట్స్ వేసి చూడగా.. పాముపై చారలు కనిపించడంతో ప్రమాదకరమైన రక్తపింజరిగా నిర్ధారించారు. ఓంకార్‌ త్యాడి పామును చాకచక్యంగా బంధించి.. సమీప అడవుల్లో విడిచిపెట్టారు. ఇది చాలా డేంజర్ స్నేక్ అంటున్నారు స్నేక్ క్యాచర్. ఇది కరిచిన వెంటనే చికిత్స అందించకపోతే మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్తాడని.. ఆపై చర్మం ముక్కలు ముక్కలుగా చీలిపోయి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. పాములు మనుషులకు ఎలాంటి హాని చేయవని, తమకు ప్రమాదం అని భావించిన సమయంలోనే భయంతో కాటు వేస్తాయని అంటున్నారు. ఎప్పుడైనా ఇలాంటి పాములు కనిపిస్తే.. వాటని చంపకుండా తమకు సమాచారం అందించాలని కోరారు.




ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాముల్లో రక్తపింజర ప్రథమ స్థానంలో ఉంటుంది. వీటి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ. అన్ని పాముల మాదిరిగా గుడ్లు పెట్టడం కాకుండా.. పిల్లలను కనడం ఈ పాము ప్రత్యేకత. కొన్నిసార్లు వందల సంఖ్యలో పిల్లలను పెడుతుందట

Also read

Related posts

Share via