తుపాకీ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజు తుపాకీ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. దీంతో హెడ్‌కానిస్టేబుల్ భూజానికి తీవ్రగాయం అయింది. కలెక్టర్ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్‌ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారాజుకు తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో హెడ్‌కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు కానిస్టేబుల్ సుబ్బారాజు తెలిపారు. ఆ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తూ.. ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు