కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఈ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వలన ప్రయాణ సమయంలో అంతరాయం, రైల్లో ఉన్న ప్రయాణీకులందరి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే అధికారులు అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు.
ట్రైన్‌లో ఏసీ సరిగా పనిచేయకపోవడంతో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్‌ను లాగేశాడు. దీంతో పోలీసులు అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. ట్రైన్ బోగీలో ఏసీ కూలింగ్ సరిగా లేకపోవడంతో అనంత్ పాండే అనే వ్యక్తి అయోధ్య సమీపంలో రైలును ఆపడానికి పలుమార్లు చైన్ లాగాడు. దీంతో ఆదివారం రాత్రి చార్‌బాగ్ స్టేషన్‌లో RPF అధికారులు పాండేను కోచ్ నుండి బయటకు లాగి అతనిపై దాడి చేశారు.
రైళ్లలో అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు మాత్రం చైన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణీకుల భద్రత, అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు వంటి ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఉపయోగించాలని రైల్వే అధికారులు, RPF సిబ్బంది చెప్పారు. కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఈ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వలన ప్రయాణ సమయంలో అంతరాయం, రైల్లో ఉన్న ప్రయాణీకులందరి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే అధికారులు అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు.
అయితే, ప్రయాణికులకు తమ మనోవేదనను తెలిపే హక్కు కూడా ఉందని చెబుతున్నారు. కానీ, సరైన కారణం లేకుండా ఎమర్జెన్సీ చైన్‌ను లాగడం చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుందని, ఇందులో జరిమానాలు లేదా జైలు శిక్ష కూడా ఉంటుందని రైల్వే పోలీసులు హెచ్చరిస్తున్నారు
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





